జిన్నా 'ప్రధాని' కోరికతోనే దేశం విడిపోయిందా?
హిందూతత్వ సంస్థలైన బిజెపి అలాగే ఆర్ఎస్ఎస్ లు ఈ గొడవలకు ముఖ్య కారణం అవుతున్నాయని అనే వాళ్ళు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని కొంతమంది చారిత్రక నిపుణులు అంటున్నారు. మరి అన్ని గొడవలకి వీళ్లే కారణం అయితే దేశ విభజన సందర్భంలో జరిగిన వాటికి కూడా వీళ్ళనే ముడి పెడతారా అని వాళ్ళు అడుగుతున్నారు. దేశ విభజన సమయానికి భారతీయ జనతా పార్టీ లేదు కదా, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా లేదు కదా అని వాళ్ళు ముఖ్యంగా చెప్పే మాట.
మరి గొడవలు అంటూ జరిగితే అవి భారతీయ జనతా పార్టీ ఇంకా ఆర్ఎస్ఎస్ వల్లే అయితే అప్పుడు జిన్నా ఎవరితో గొడవ పడ్డారు అని ఆ చారిత్రక నిపుణులు అడుగుతున్నారు. లేదంటే జిన్నా మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా గొడవకు దిగాడా, నెహ్రూకి వ్యతిరేకంగా గొడవకు దిగాడా అని అడుగుతున్నారు. అప్పుడు జిన్నా హిందువులకు వ్యతిరేకంగా గొడవకు దిగాడని వాళ్ళు చెప్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే జిన్నా జవహర్లాల్ నెహ్రూకి బదులుగా తనను ప్రధాన మంత్రిని చేయమని అడిగాడని చెబుతారు. అయితే దానికి మహాత్మా గాంధీ ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఎందుకు అంటే హిందువులు ఎక్కువగా ఉన్న భారత దేశానికి ఒక ముస్లింను ప్రధాని గా చేస్తే ప్రజలు ఒప్పుకోరని ఆయన భావించారని అంటున్నారు. మన భారతదేశం విషయం పక్కన పెడితే, ఇతర దేశాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి కదా అంటే అక్కడ గొడవలకు కూడా ఆర్ఎస్ఎస్ అలాగే బిజెపి కారణమని అంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.