మృత్యు దీవి.. అక్క‌డ అడుగుపెడితే మ‌ర‌ణ‌మే..ల‌క్ష‌ల్లో శ‌వాలు..!

Paloji Vinay
దీవి అనే పేరు విన‌గానే అంద‌మైన సీన‌రీలు, స‌ముద్రం ప‌క్క‌న ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం గుర్తుకు వ‌స్తుంది. కానీ వెనీస్ న‌గ‌రం నుంచి 16 కిమీల దూరంలో ఓ దీవి ఉంది. అక్క‌డ ప్ర‌జ‌లు జీవించేందుకు అనూకూల‌మైన‌దే. కానీ ఆ దీవికి వెళ్లేందుకు ఎవ‌రూ సాహ‌సం చేయాడానికి వెనుకాడుతున్నారు. అక్క‌డ మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం కూడా వెన‌క‌డుగు వేస్తోంది. అక్కడికి వెళ్లేందుకు ప్ర‌భుత్వ‌మే భ‌య‌ప‌డుతుంటే మ‌రి సాధార‌ణ జ‌నం ఉండ‌గ‌ల‌రా అస‌లు ఆ దీవిలో అడ‌గు పెట్టేందుకు ఎందుకు జంకుతున్నారు. అస‌లు కార‌ణ‌మేంటి.?
 ఆ అందమైన దీవి పేరు ‘పోవెగ్లియా’, కానీ ఇటలీ ప్రజలు దాన్ని ఓ శవాల దిబ్బగా పిలుస్తారు.  అల‌గ‌ని అది స్మశానం మాత్రం కాదు. ఒకప్పుడు ప్లేగు వ్యాధితో నరకయాతన అనుభవించిన రోగుల ఆర్తనాదాలతో మారుమోగిన భూలోక నరకం ఆ దీవి. 16వ శతాబ్దంలోనే సుమారు లక్ష మంది పైగా రోగులు అక్కడ మరణించారని చెబుతుంటారు. కాలక్రమేనా ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడం లేదు. అయితే, వెనీస్ తదితర నగరాల్లో పర్యటించేందుకు వెళ్లే చాలామంది పర్యాటకులు ఆ దీవిని చూసేందుకు వెళ్తుంటారు.

    16వ శతాబ్దంలో వ‌చ్చిన‌ ప్లేగు వ్యాధి ఇటలీని అత‌లాకుత‌లం చేసింది. వ్యాధిగ్రస్తులను అక్కడే ఉంచితే అది మరింత మందికి సోకుతుందనే ఉద్దేశంతో శవాలను, రోగులను తీసుకెళ్లి ‘పోవెగ్లియా’లో విడిచిపెట్టేవారు. దీంతో, రోగులు ఆ శవాల మధ్యే జీవించేవారు. తిండి లేక, రోగానికి చికిత్స అంద‌క‌  అక్కడే మ‌ర‌ణించే వారు. వీరిలో చిన్నారుల‌కు కూడా ఇదే దుస్థితి ఉండేది. ఈ అరాచకాన్ని అప్పట్లో పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్ర‌యోజ‌నం ఉండేది కాదు.  ఎన్నో పోరాటాల తర్వాత ప్రభుత్వం అక్కడ ఒక చర్చితోపాటు రోగులు ఉండేందుకు ఓ భవనం ఏర్పాటు చేసింది. వేల సంఖ్యలో చనిపోయిన రోగులను ఆ దీవిలోనే సామూహికంగా పూడ్చిపెట్టేవారు.  స్థలం లేకపోవడంతో మిగతా శవాలను దహనం చేసేవారు.

       ఎంతో అందంగా కనిపించే ఆ దీవిని పర్యటకానికి వినియోగించుకోవాలని ప్ర‌య‌త్నాలు చేశారు. కొన్ని సంఘ‌ట‌న‌లతో పాల‌కులు వెన‌క‌డుగు వేశారు. కొత్త నిర్మాణాలు చేప‌ట్టడానికి త‌వ్వ‌కాలు జ‌రుపుతున్న సంద‌ర్భంలో వేల సంఖ్యలో బ‌య‌ట‌ప‌డ్డాయి. అక్క‌డ ఆత్మ‌లు సంచ‌రిస్తున్నాయ‌నే వార్త‌ల‌తో ఆ దీవిలోకి ప్ర‌వేశం నిషేధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. అయితే, ఏకాంతం కోరుకునేవారు.. వెనీస్ నుంచి ప‌డ‌వ‌ల్లో ఆ దీవికి వెళ్లేవారు. కానీ వారు క‌నిపించేవారు కాద‌ని వారి కోసం గాలించ‌గా శ‌వాలై క‌నిపించార‌ని చెబుతుంటారు కొంద‌రు. దీవికి ద‌గ్గ‌రగా నివ‌సించేవారు త‌మ‌కు వింతైన శ‌బ్ధాలు వినిపిస్తాయ‌ని, ట‌వ‌ర్‌లోని గంట ఎవ‌రి ప్ర‌మేయం లేకుండానే మోగుతుంద‌ని అంటుంటారు.

ఇప్పుడు ఆ దీవి నిషేదిత ప్రాంతం కావ‌డంతో ఎవ‌రిని లోప‌లికి అనుమ‌తించ‌రు. ఒక‌వేళ ప‌ర్య‌ట‌కులు సంద‌ర్శించ‌డానికి ఆస‌క్తి చూపిస్తే కొన్ని ద‌ర‌ఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వారికి ఏం జ‌రిగినా ప్ర‌భుత్వానికి బాధ్య‌త ఉండ‌బోద‌ని ముందుగానే ద‌ర‌ఖాస్తులో రాసి ఉంటుంది. దేయ్యాల అన్వేష‌కుల‌కు ఇది మంచి స్థ‌లం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: