కోటప్పకొండ చరితము చూతము రారండి ..!

Divya
ఇప్పటికే భారతదేశం ఎన్నెన్నో కళలకు పుట్టినిల్లు అని తెలిసిన విషయమే. అయితే ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎన్నో విభిన్నమైన కళలను తనలో దాచుకుంది. భారతదేశంలో ఎక్కడో ఉన్న కట్టడాల గురించి తెలుసుకుంటున్నామే కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన కట్టడాల గురించి తెలుసుకోలేక పోతున్నాం అంతే కాదు వాటి హిస్టరీ కూడా తెలియక, ఏదో లాగ భగవాన్ స్మరణం చేసుకుంటూ ఉన్నాము.. అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోదగిన దేవాలయం కోటప్పకొండ..

సాధారణంగా పెద్దలు చెప్పే సామెత కాకులు దూరని కారడవి ఉందో..? లేదో..? తెలియదు కానీ కాకులు వాలని కొండ మాత్రం ఖచ్చితంగా వుంది. సాధారణంగా కొండ ప్రాంతాలలో, చెట్ల మీద ఈ కాకుల సైన్యం చాలా ఎక్కువగానే ఉంటుంది . కానీ కోటప్పకొండ మీద మాత్రం ఇప్పటికీ ఒక కాకి కూడా వాలదట. కోటప్పకొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట కు  15 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. అయితే ఈ కోటప్ప కొండ మీద దర్శనానికి భక్తులు మహాశివరాత్రి, కార్తీక మాసం  రోజున పోటెత్తారు.

భగవంతుని దర్శనం కోసం వెళ్లేదారిలో కొన్ని వేల కాకులను చూసినప్పటికీ, కొండ మీద మాత్రం ఒక కాకి కూడా వాలదు. ఈ కొండపైన కాకులు ఎందుకు వాలవో అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ కోటప్ప కొండ చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుందాం..
దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత  పరమేశ్వరుడు ఒక బాలుని అవతారం ఎత్తి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బ్రహ్మ దేవుడు దక్షిణామూర్తిని  దర్శించి , తనకు జ్ఞానభోద చేయమని కోరతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ.. త్రికూటాచలానికి వస్తే జ్ఞానబోధ చేస్తాను అని సెలవిస్తాడు. బ్రహ్మ ఇతర దేవతలతో కలసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే ఇప్పుడు కోటప్పకొండ గా పిలువబడుతోంది.

కోటప్పకొండ లో ఎటువైపు నుంచి చూసిన 3 మూడు శిఖరాలు కనిపిస్తాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ ప్రదేశాన్ని త్రికూటేశ్వరం గా, ఇక్కడ కొలువై ఉన్న స్వామిని త్రికూటేశ్వరుడు గా భక్తులు పూజిస్తారు. త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు ,తన భార్య కుందరితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు సుంధుడు పశువులను కాచుకుంటూ రుద్ర కొండ పై ఉన్న త్రికూటేశ్వరుడు దర్శనం చేసుకుంటాడు.

తర్వాత ఒక కుమార్తె జన్మిస్తుంది . ఆమె పేరు గొల్లభామ. ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. గొల్లభామ మాత్రం శివుడి పట్ల అత్యంత భక్తితో పూజిస్తూ ఉంటుంది. ఆమె ప్రతి రోజు రుద్రకోట పైన పాత కోటేశ్వర ఆలయంలో ప్రతి రోజు అత్యంత భక్తితో పూజలు చేస్తూ ఉంటుంది.

ఆమె భక్తిని పరీక్షించడానికి పరమశివుడు కన్య అయినటువంటి ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భం దాల్చినప్పటికీ పరమేశ్వరుని కొలవడం మాత్రం ఏ రోజు మానుకోలేదు. అయితే అలా ఎప్పటిలాగే ఒక రోజు పరమేశ్వరుని దర్శనం కొరకు ఒక చల్లని కుండలో పెరుగును తీసుకు వస్తూ ఉండగా , ఆయాసంతో కొండ మెట్ల పై కూర్చుంటుంది. అంతలోపు అక్కడ ఒక కాకి స్వామివారికి నైవేద్యంగా తీసుకెళుతున్న పెరుగు కుండను  నేలపాలు చేస్తుంది.

తీవ్ర మనస్థాపానికి చెందిన గొల్లబామ దగ్గరకు, ఒక వృద్ధాప్య పండితుడి రూపంలో పరమేశ్వరుడు, ఆమె దగ్గరకు వచ్చి నీ విచారణకు కారణమైన కాకులు.. ఇకపై ఈ కొండపై వాలవు అని వరమిస్తాడు. ప్రతిరోజు గర్భంతో ఉన్న గొల్లభామ పైకి కిందకు ఎక్కలేనని పరమశివుడిని కింద ఉండి పోమని అడగడంతో అందుకు పరమశివుడు సరేనని చెబుతాడు..అయితే నీవు వెళ్ళేటప్పుడు వెనుతిరిగి చూడకుండా వెళ్ళాలి అని ఆమెకు షరతు కూడా పెడతాడట.

అయితే వెళ్తున్న దారిలో భయంకరమైన అరుపులు, శబ్దాలు వినడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు పరమశివుడు అక్కడే జంగందేవర కొండపై అక్కడే ఉన్న గుహలో శివలింగం గా మారిపోతాడు. ఆ ఆలయమే నేడు కోటప్పకొండ గా పిలువబడుతోంది. ఇక గొల్లభామ కూడా అక్కడే కొండ కింది భాగంలో పరమేశ్వరుడిలో ఐక్యమవుతుంది . ఇక బ్రహ్మచారిగా వెలసిన పరమేశ్వరుడు కొండ కాబట్టి ఇక్కడ అమ్మవారి ఆలయాలు కూడా ఉండవు. అందుకే కోటప్ప కొండ మీద పెళ్లిళ్లు కూడా జరగవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: