ఆగష్టు 22: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల విషయానికి వస్తే..

1864 వ సంవత్సరంలో మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేయడం జరిగింది.

1922 వ సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.

1932 వ సంవత్సరంలో టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించడం జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..

1860 వ సంవత్సరంలో పాల్ గోటిలిబ్ నిప్కో జన్మించారు. ఈయన నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త.

1869 వ సంవత్సరంలో పింగళి వెంకట రామారెడ్డి జన్మించారు. వీరు నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.

1869 వ సంవత్సరంలో డొరొతీ పార్కర్ జన్మించారు. ఈమె అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి.

1924 వ సంవత్సరంలో హరిశంకర్ పరసాయి జన్మించారు. ఈయన హిందీ కవి.

1924 వ సంవత్సరంలో సి.మాధవరెడ్డి జన్మించారు. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.

1933 వ సంవత్సరంలో గోపీకృష్ణ జన్మించారు. ఈయన భారతీయ నృత్యకారుడు, నటుడు ఇంకా నృత్య దర్శకుడు.

1935 వ సంవత్సరంలో డి. కామేశ్వరి జన్మించారు. ఈమె కథా ఇంకా నవలా రచయిత్రి.

ఇక 1955 వ సంవత్సరంలో చిరంజీవి జన్మించాడు. ఈయన తెలుగు చలనచిత్ర నటుడు.

1964 వ సంవత్సరంలో రేకందార్ గుణవతి జన్మించారు. ఈమె రంగస్థల నటి.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే...

ఇక 1948 వ సంవత్సరంలో షోయబ్ ఉల్లాఖాన్ మరణించారు. ఈయన తెలంగాణా సాయుధ పోరాట యోధుడు అలాగే బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు ఇంకా నిర్భయ జర్నలిస్ట్ అలాగే మత దురహంకారానికి వ్యతిరేకి.

ఇక 1986 వ సంవత్సరంలో శోభా సింగ్ మరణించారు. ఈయన పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. అలాగే పద్మశ్రీ పురస్కార గ్రహీత.

2014 వ సంవత్సరంలో యు.ఆర్.అనంతమూర్తి మరణించారు. ఈయన కన్నడ రచయిత అలాగే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: