టిఫిన్ చేసిన వెంటనే "టీ" తాగే వాళ్ళకి షాకింగ్ న్యూస్

Bhavannarayana Nch

టిఫిన్ కానీ, భోజనం కానీ చేసిన వెంటనే చాలా మందికి “టి” లేదా “కాఫీ” త్రాగే అలవాటు ఉంటుంది..అలా చేసేవాళ్ళకి శరీరం డేంజర్ బెల్స్ మోగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు..ఉదయం టిఫిన్ కానీ , భోజనం ,మధ్యాహ్నం భోజనం చేసినవాళ్ళు వెంటనే టీ ,కాఫీలు తగ్గేస్తూ ఉంటారు అలా చేస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

 

జీర్ణ వ్యవస్థ మెరుగు పరచడానికి కడుపులో సగానికి నీరు..సగానికి ఆహార పదార్దాలు ఉండాలి అప్పుడే జీర్ణ ప్రక్రియ సరిగా జరుగుతుంది. టీ,కాఫీ తాగిన తరువాత సుమారు ఒక గంట సమయం తరువాత ఏదన్నా తినాలి తప్ప వెంట వెంటనే ఏమీ తినకూడదు..ఒక వేళ అలా చేస్తే కడుపులో అసిడిటీ ,గ్యాస్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది.గుండె సంబంధిత వ్యాధులుబారిన పడాల్సి వస్తుంది.

 


ఉదయాన్నే టిఫిన్‌‌‌ చేసిన తర్వాత ఆఫీసులకి వెళ్ళినా...స్నాక్స్‌.. బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి టిఫిన్ తినడం..భోజనం చేయడం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. అంతేకాదు భోజనం తిన్న తరువాత కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటే కొవ్వు పొట్ట భాగంలో పేరుకుపోకుండా ఉంటుంది..

 

అలాగే ఉదయాన్నే లేవగానే గ్రీన్ టీ త్రాగడం వలన శరీరంలో ఉండే మలినాలు..అన్నీ కూడా నసింపబడుతాయి..శరీరం అనారోగ్యం బారిన పడకుండా కాపాడే రోగనిరోధక శక్తిని అధికం చేయడంలో “గ్రీన్ టీ” ఎంతో బాగా ఉపయోగపడుతుంది.కనీసం రోజుకు ౩ నుంచీ 4 సార్లు గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి మంచిది..ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది..గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: