ఈ వ్యాధులతో బాధపడేవారు.. వంకాయని తింటే విషమే..!
వంకాయ పిత్త, కఫని పెంచుతుంది. అంటే కొన్ని వ్యాధులు ఉన్న వారికి ఇది సమస్యగా మారుతుంది. ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవారు వంకాయ తినడం వల్ల ఇందులో ఉండే" సోలనైస్ " ఉంటుంది ఇది శరీరంలో మంటను పెంచి కీళ్ల నొప్పులను మరింత పెంచేలా చేస్తుందట.
ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే వారు వంకాయను తినకపోవడం మంచిది. ఇందులో ఆక్సలెట్ అనే మూలకం ఉండడం వల్ల ఇది క్యాల్షియంతో కలిసి రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచేలా చేస్తుంది. దీని వల్ల సమస్య మరింత పెద్దదవుతుంది.
కొంతమందికి వంకాయను తినడం వల్ల అలర్జీగా అవుతుంది. వంకాయ తిన్న తర్వాత చర్మం పైన దురద, దద్దుర్లు వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటివారు వంకాయని తినకపోవడమే చాలా ఉత్తమం.
పైల్స్ రోగులు వంకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వంకాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది పైల్స్ సమస్యను మరింత పెంచేలా చేస్తుంది. ఫైల్స్ వచ్చినచోట దురద ,మంటను పెంచి ఇబ్బందులకు గురిచేస్తుంది.
గ్యాస్ ,అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వంకాయను దూరంగా పెట్టడం మంచిది. వంకాయ పైన ఉండే చర్మం కాస్త బరువుగా, మందంగా ఉంటుంది కాబట్టి జీర్ణం కావడానికి కొంత కష్టంగానే ఉంటుంది. దీనివల్ల గ్యాస్ ఉబ్బర సమస్యలు మరింత పెరుగుతాయి.