సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. అదే ఈ మొక్క..!

Divya
మన చుట్టూ ప్రకృతిలో చాలా రకాల మొక్కలు సైతం మనకు లభిస్తూ ఉంటాయి. అయితే ఇందులో మనకి చాలా రకాల మొక్కల వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అలాంటి వాటిలో అతిబల మొక్క కూడా ఒకటి. ఇది మన ఇంటి చుట్టూ లేదా తోటలలో ఎక్కడైనా సరే ఇది దొరుకుతూ ఉంటుంది. ఈ మొక్క పెరగడానికి ఎలాంటి నీరు కూడా అవసరం ఉండదు. ఈ మొక్క ఆకులు పసుపు రంగులో ఉంటాయి ,కాయలు ,పువ్వులు, ఆకులు, కాండం, వేళ్ళు ఇలా అన్నీ కూడా ఈ మొక్కకు సంబంధించిన వాటివన్ని కూడా చాలా ఉపయోగాలు ఉంటాయట. ఈ మొక్క వల్ల ఎన్నో వ్యాధులకు సైతం చెక్ పెట్టవచ్చట.

ముఖ్యంగా కుష్టి, మూత్రశయ సమస్యలు, అలాగే కామెర్లు, గాయాలు, అలసర, విరోచనాలు, అలర్జీ ,నీరసం ,తలనొప్పి, కండరాల బలహీనత ఇలా ఇవే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను సైతం ఈ అతిబలం మొక్క తగ్గిస్తుంది. కాబట్టి ఈ మొక్కను సకల రోగాల బ్రహ్మాస్త్ర మొక్కగా మన పూర్వీకులు సైతం భావించే వారట.. ఈ మొక్క ఆకులను సైతం నీటిలోకి వేసి మరిగించిన తర్వాత నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పి చిగుళ్ల నొప్పి నోటిలో బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందట.

ఈ మొక్క వేర్లు చూర్ణంగా చేసుకొని అందులోకి కాస్త బెల్లాన్ని నంచుకొని కలిపి తింటే అతి దాహం అనేది తగ్గిపోతుందట. అతిబల మొక్క ఆకులను డికాషన్ రూపంలో చేసుకుంటే దగ్గు వంటిది తగ్గుతుందట. అలాగే మూత్రశయ సమస్యలను కూడా తగ్గించడానికి ఈ అతిబల మొక్క ఉపయోగపడుతుంది. ఎవరైనా నీరసంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అతిబల మొక్క యొక్క ఆకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల వెంటనే శక్తి పెరుగుతుందట. అందుకే ఈ అతిబల మొక్క ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: