మూత్రం బలవంతంగా ఆపుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
మూత్రాన్ని అలాగే ఆపుకున్నట్లుగా అయితే యూరినరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్ వస్తుందట. ఇది మూత్రశయంలో ఉండే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్ కి కారణం అవ్వడం వల్ల కిడ్నీల పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయట. అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటూ ఉండటం వల్ల మూత్రశయ కండరాలు కూడా చాలా బలహీన పడతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనివల్ల సామర్థ్యం రోజు రోజుకి తగ్గిపోతుందని తెలియజేస్తున్నారు. మూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా మంట నొప్పి వంటివి కలిగిస్తాయట.
మూత్రాన్ని అలాగే బీగపట్టుకోని ఉంటే మూత్రపిండాలపైన ఒత్తిడి పెరిగి వీటి పనితీరు కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కిడ్నీలలో రాళ్లు కూడా ఏర్పడతాయట. ఇవే కాకుండా చాలా ఇబ్బందులు ఎదురవుతాయట.
మూత్రాన్ని ఎక్కువగా ఆపుకుంటూ ఉండటం వల్ల మూత్రశయం వాపు వస్తుందట. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో మంట అసౌకర్యాన్ని కలిగిస్తుందట.
మూత్ర విసర్జన సంకేతాలు వచ్చినప్పుడు వాటిని ఆపకుండా వెంటనే పని కాని చేయాలి పని కోసం వీటిని ఆపుకున్నట్లు అయితే చాలా ప్రమాదంలో పడతారట. సమయానికి మూత్ర విసర్జన, మూత్రం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.