కాలయాన్ని నాశనం చేసే ఈ 5 ఆహారాలు అస్సలు తినకండి ?
అయితే కొన్ని ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది లివర్ ను రిస్క్ లో పెడుతున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ తాగినప్పటికీ అంతకంటే ప్రమాదకరమైన పదార్థాలను తింటూ కాలేయానికి ఇబ్బందులు తెస్తున్నారు. ముఖ్యంగా చక్కెర కలిపిన ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్, లివర్ కు ఎఫెక్ట్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువ మోతాదులో ఫ్రక్టోజ్ ఉంటుంది. దీనివల్ల కాలేయంలో కోవ్వును నిల్వ చేయడంవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది.
చాలామంది ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, చిప్స్, ఫ్రైడ్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటున్నారు. దానివల్ల ఆ కొవ్వు, నూనె వస్తువులు కాలేయం పైన పేరుకుపోయి కుళ్లిపోయేలా చేస్తున్నాయి. పాస్తా, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ వంటివి తినడం వల్ల ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కాలేయం పైన కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి బ్రెడ్ లలో చక్కెర మరియు ఫైబర్ ఉండడం వల్ల కాలేయం పైన కొవ్వు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. వెన్న, పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు కూడా కాలేయం పాడవడానికి ఒక కారణం అని చెప్పవచ్చు.
దీనిలో అధిక సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కొవ్వుగా మారుస్తాయి. బేకన్, సాసేజ్, హాట్ డాగ్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో అధిక మొత్తంలో కొవ్వు, ఉప్పు, మసాలాలు ఉండడం వల్ల ఇది కాలేయంపై అధిక ఒత్తిడిని తెస్తుంది. అందుకే ఎక్కువగా బయటి ఆహారాన్ని అసలు తీసుకోకూడదని వీలైనంత తక్కువ మోతాదులో మాత్రమే బయట ఆహారాన్ని తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.