రోజు పెరుగు తింటున్నారా....అయితే డేంజర్ పడ్డట్టే?
ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో కాల్షియం, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి, ఎముకలకు చాలా మంచిది. అంతేకాదు కొలెస్ట్రాల్ లెవెల్ ను తగ్గించి బీపీని సైతం నార్మల్ స్థాయికి తీసుకువస్తుంది. ఫలితంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెరుగు తినడం వల్ల హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు పెరుగును సరైన మోతాదులో తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గి మంచి ఫిట్నెస్ పొందుతారు.
పోషక విలువల కారణంగానే ఆహార పదార్థాల్లో పెరుగుతో ఎంతో ప్రాధాన్యత ఉంది. బరువు తగ్గాలనుకునే వారు పెరుగును క్రమం తప్పకుండా తినాలని దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. పెరుగులో కొవ్వును నియంత్రించి బరువు పెరగకుండా చేస్తుంది. పెరుగులో ఉండే ఫాస్పరస్, కాల్షియం ఎముకల బలానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. దంతాలు, ఎముకలు బలంగా ఉండడానికి కచ్చితంగా పెరుగు తినాలి. మలబద్ధకం, డయేరియా, ఉబ్బరం లాంటి సమస్యలు సైతం పెరుగు తినడం వల్ల తొలగిపోతాయి. ఆహారంలోని పోషకాలు శరీరానికి అందేలా చేస్తాయి.
పెరుగు చర్మ సంరక్షణలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి తగినన్ని పోషకాలను అందించి ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, జింక్ చర్మానికి రక్షణ కవచంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల జుట్టుకు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.
జుట్టుకు కావలసిన న్యూట్రిషన్స్, మినరల్స్ అందించి డాండ్రఫ్ వంటి సమస్యలను సైతం తొలగిస్తుంది. పెరుగు హెయిర్ కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హెన్నాతో పెరుగును తలకు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్యలు సైతం తొలగిపోతాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో చక్కగా పనిచేస్తుందని.... ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పెరుగును తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.