ఇలా చేస్తే ఇంట్లోకి ఈగలు రానే రావు?

Purushottham Vinay

మన ఇంట్లో ఈగలు ఎక్కడెక్కడో చెడు వ్యర్థాలపై వాలుతూ ఉంటాయి. కాబట్టి వీటి పట్ల ఖచ్చితంగా మరింత కేర్ తీసుకోవాలి. మన ఇంట్లోని ఆహార పదార్థాలపై కూడా అవి వాలుతూ ఉంటాయి. అలాంటి ఆహారం తినడం వల్ల ఎన్నో రోగాలు వచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందుకే ముందు ఇంట్లోకి ఈగల్ని రానివ్వకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ ఇంట్లోకి ఈగలు వచ్చినా వాటిని తరిమికొట్టేందుకు ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే సమస్య ఉండదు.మన ఇంట్లోకి ఈగలు రాకుండా చేయడంలో ఫినాయిల్ కూడ ఎంతో చక్కగా పని చేస్తుంది. అందుకు మీరు కొద్దిగా నీటిలో ఫినాయిల్ వేసి ఇంట్లో మాప్ పెట్టండి. ఈ వాసనకు ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి.అలాగే ఈగల్ని ఇంట్లోకి రాకుండా చేయడంలో దాల్చిన చెక్క కూడా చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఇంకా అంతే కాకుండా దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దాల్చిన చెక్కను ముక్కలు కట్ చేసి.. ఇంటిలోని అన్ని మూలాల్లో, కిటికీల దగ్గర కూడా పెట్టండి. 


ఈ వాసనకు ఈగలనేవి అసలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.ఇంకా అలాగే కర్పూరంతోనే కాకుండా విడిగా బిర్యానీ ఆకులను కాల్చితే పొగ వస్తుంది. ఆ పొగను ఇల్లంతా కూడా వ్యాపించండి. అయితే ఇలా చేయడం వల్ల కూడా ఈగలు ఇంట్లోకి రావు.అలాగే కర్పూరంతో కూడా ఈగల్ని రాకుండా చేయవచ్చు. ఈగలు ఈజీగా బయటకు పోవాలంటే.. కర్పూరాన్ని కాల్చి ఇల్లంతా కూడా తిరగండి. ఇప్పుడు ఈ వాసన ఇల్లంతా కూడా ఉంటుంది. దెబ్బకు ఈ వాసనకు ఈగలు రాకుండా ఉంటాయి. అలాగే కర్పూరంతో పాటు లవంగాలు, బిర్యానీ ఆకులు కలిపి కాల్చితే మరింత ప్రయోజనం ఉంటుంది.యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా ఇంట్లో ఈగలని ఈజీగా తరిమి కొట్టవచ్చు. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ నుంచి ఘాటు వాసన వస్తుంది. పైగా ఈ వాసన ఈగలకు పడదు కాబట్టి ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి. అయితే అందులో కొద్దిగా నీళ్లు, కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి స్ప్రే చేయండి. ఇక ఇలా చేయడం వల్ల ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: