పిల్లలు ఇష్టంగా తినాలంటే.. ఇలా చేయండి..!

Divya
ఈరోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఉండే తల్లిదండ్రులు సైతం పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు బ్యాగ్స్ ఇలా అన్నిటినీ సైతం తీసుకొని వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా లంచ్ బాక్స్ ప్యాక్  చేయడం పిల్లలకు చాలా పెద్ద విషయమని చెప్పవచ్చు. ప్రతిరోజు ఏం వండినా కూడా కచ్చితంగా బాక్స్లో పెట్టేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఏది ఇష్టంగా తింటారు అనే విషయం పైన తల్లులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారట.

1). ముఖ్యంగా పిల్లలు ఏది ఎక్కువగా తింటారో వాటిని అడిగిమరీ ప్యాక్ చేయడం మంచిది. దీనివల్ల పిల్లలు తినని పదార్థం ఏంటో మనకి త్వరగా అర్థమవుతుంది.

2). లంచ్ బాక్సులో అన్నం కూర మాత్రమే కాకుండా ఏవైనా ఫ్రూట్స్ వంటివి రోజుకి ఒకటి చొప్పున బాక్స్ లో ప్యాకింగ్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తినడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎనర్జీ కూడా ఉంటుంది.
3). ఏదైనా ఖాళీ సమయాలలో పిల్లలు తినడానికి డ్రై ఫ్రూట్స్, పల్లి పట్టి పలు రకాల గింజలను లడ్డులు అరటిపండు పంపించడం మంచిది.

4). ముఖ్యంగా లంచ్ బాక్స్ పిల్లలను అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి.. అన్నిటినీ ఒకే బాక్సులో కాకుండా వేరువేరు బాక్స్లో ప్యాకింగ్ చేసేలా జాగ్రత్తపడాలి.

5).అయిదారేళ్ళు వయసు ఉన్న పిల్లలు సైతం కొంచెం కొంచెం తినగలరు కాబట్టి వారికి మెయిల్ స్నాక్స్ రూపంలో రోజుకి కనీసం ఐదారు సార్లు తినేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా పోషకాహార ఎక్కువగా ఉండే వాటిని పంపించడం మంచిది.

6). పిల్లలు ఏవైతే ఎక్కువగా తింటారో వాటిని కనీసం వారంలో ఐదు రోజులు పక్కాగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలు ఎక్కువగా ఏదైనా వెరైటీగా చేసే రైస్, కూరలని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా టమోటా, క్యారెట్, బీట్రూట్, మిక్స్డ్ వెజిటేబుల్స్, జీరా, ఎగ్ రైస్ వంటి వాటిని కనీసం వారంలో రెండు రోజులు చొప్పున చేర్చడం మంచిది.

మిగిలిన రెండు రోజులలో ఆకుకూరలు అయినా పాలకూర ,మునగ కూర, మెంతికూర ,ఆలు వంటి వాటిని కలిపి చేసి చపాతీ వంటివి పంపించడం మంచిది

అలాగే ఫ్రూట్స్ లను కూరగాయలను బాగా ముక్కలు ముక్కలుగా చేసి నూడిల్స్ లేదా పిస్తా, ఉప్మా, ఇడ్లీ ,దోశ, పిజ్జా, సాండ్విచ్ వంటివి పెడితే ఇష్టంగా తింటారట. ముఖ్యంగా ఒక వారం పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఐటమ్స్ మరొక వారం పెట్టకుండా చూసుకోవాలి. అలాగే చిన్నారులకు అల్పాహారం కింద చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్స్ ,జంక్ ఫుడ్, నూనె పదార్థాలతో కూడినవి అసలు పంపకూడదని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: