వామ్మో! సరిగ్గా నిద్రపోకపోతే అంత దారుణం జరుగుతుందా?

Purushottham Vinay
మనం ఎక్కువసేపు నిద్రపోకపోతే మన గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా అధిక రక్తపోటుకు దారితీయవచ్చు. కాలక్రమేణా ఈ అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తికి తగినంత నిద్ర అవసరం. నిద్ర పోయినప్పుడు, ఫలితంగా చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.నిద్ర లేమితో డ్రైవింగ్ చేయడం లేదా యంత్రాలను ఆపరేట్ చేయడం వల్ల ప్రమాదాలు, గాయాల ప్రమాదం పెరుగుతుంది.మెదడు బాగా పనిచేసినప్పుడే ఏ విషయాన్ని అయినా బాగా విశ్లేషించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. కానీ నిద్ర లేనప్పుడు, సమస్యలు పరిష్కరించబడవు. సమస్య మరింత తీవ్రమవుతుంది.సరిగ్గా నిద్రపోవడం బరువుపై ప్రభావం చూపుతుంది. అయితే నిద్ర తక్కువగా ఉన్నప్పుడు శరీరం బాగా అలసిపోతుంది. ఇది చక్కెర, కొవ్వుతో కూడిన ఆహారాల కోసం కోరికలను పెంచుతుంది. ఆకలిని పెంచుతుంది. పెరిగిన ఆకలి అతిగా తినడం, బరువు పెరగడానికి దారితీస్తుంది.మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కానీ మీరు ఆ నిద్రను తగినంతగా పొందకపోతే, శరీరం జెర్మ్-ఫైటింగ్ కణాలను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తుంది.


ఫలితంగా తరచూ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.సరైన నిద్ర లేకుంటే మెదడులోని మానసిక స్థితిని నియంత్రించే రసాయనం ప్రభావితమవుతుంది. ఫలితంగా, మనస్సు ఏకాగ్రత పొందలేకపోతుంది. దేనిపైనా ఆసక్తి లేకుండా మనస్సు తిరుగుతుంది.ప్రతిరోజూ తక్కువ మొత్తంలో నిద్రపోతే, దాని ఫలితంగా  వ్యక్తి దేనిపైనా దృష్టి పెట్టలేడు. మెదడు సరిగ్గా పనిచేయాలంటే నిద్ర అవసరం. నిద్ర లేనప్పుడు, శరీరం అలసిపోతుంది. సమర్థవంతంగా పనిచేయదు. దీంతో పనిపై ఏకాగ్రత కష్టమవుతుంది.శరీరానికి తగిన విశ్రాంతి నిద్ర ద్వారానే లభిస్తుంది. కానీ ఆ నిద్ర సరిగా రాకపోతే, ఫలితంగా చాలా అలసటగా అనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న విషయాలకే చిరాకు పడవచ్చు.నిద్ర ఉంటేనే శరీరం ఆరోగ్యంగా, చక్కగా పని చేస్తుంది. వీటిలో ఒకదాన్ని కోల్పోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. శరీరం, మనస్సు రెండింటి ఆరోగ్యానికి ప్రతిరోజూ తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 7-8 గంటల నిద్ర చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: