మెడ పై నల్లగా ఉందా.. ఆ వ్యాధి హెచ్చరికేనా..?

Divya
చిన్న వయసులోనే చాలామందికి మధుమేహం బారిన పడుతూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి అందరికీ వస్తోంది.. ముఖ్యంగా మారుతున్న జీవన శైలి కారణంగా మధుమేహం వ్యాధి బారిన ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా మధుమేహం వచ్చే ముందు మన శరీరంలో కొన్ని సంకేతాలు కూడా ఉంటాయని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా మెడ పైన నల్లటి మచ్చలు మధుమేహానికి సంకేతం అంటూ వైద్యులు తెలుపుతున్నారు.. మెడ పైన ఉండేటువంటి నల్లని మచ్చ మనం ఏం చేసినా పోకపోతే అది మధుమేహానికి సంకేతం అని గుర్తించాలి. పరిశోధనలో చివరిగా ఇలాంటి నల్ల మచ్చలు మధుమేహం ఫలితం అని వైద్యులు గుర్తించారట. డయాబెటిస్ పేషెంట్లకు మెడ చుట్టూ చర్మం పైన ఇలాంటి నల్లటి మచ్చలు కూడా వస్తాయని వెల్లడించారు.. అయితే ఇవి కొంతమందికి మాత్రమే ఇలా ఉంటుందని తెలిపారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య వల్ల కూడా ఇలా జరుగుతుందని పరిశోధనల తెలియజేశారు.

షుగర్ మచ్చలు తరచుగా మెడ చుట్టూ , చంకలో చేయిమడతలలో, గజ్జలలో ఇతరత్త ప్రాంతాలలో ఎక్కువగా వస్తూ ఉంటాయట. ఇన్సులిన్ అధిక స్థాయి చర్మ కణాల పైన ప్రేరేపించినప్పుడు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే అధిక బరువు టైప్-2 డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నవారు ఈ డార్క్ స్పాట్ ను కూడా గుర్తించవచ్చు. అయితే ఎందుకు నిర్దిష్టమైన ఔషధం లేనప్పటికీ చర్మవ్యాధి నిపుణులను కలవడమే సరైన చికిత్స.

ఇలాంటి వారు పిండి ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి. చక్కెర తీసుకోవడం కూడా క్రమంగా తగ్గించడం మంచిది.

ముఖ్యంగా ఆ మచ్చలు దేనికి సంకేతం అనే విషయం పైన వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే షుగర్ పరీక్షలు కూడా చేయించుకోవాలి.

నల్లటి మచ్చలు శరీరం పైన ఏదో ఒక సమస్యతో ఉన్నప్పుడే వస్తాయని విషయాన్ని గుర్తించాలి. దీనివల్ల వెంటనే వైద్యులను కూడా సంప్రదించడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: