మేడిపండు తినడం వల్ల ఆ సమస్యలు దూరం..!!

Divya
మన పూర్వీకుల నుంచి మేడి పండు చెట్టుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు.. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టుకి పండుకి మంచి ప్రాధాన్యత కలిగి ఉంది.. ముఖ్యంగా వీటి బెరడులు, పాలు, పండ్లు కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలను సైతం దూరం చేస్తాయి. ఎన్నో రకాల మందులుగా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా ఫైల్స్ సమస్య తో ఇబ్బంది పడేవారు మేడిపండు ద్వారా వాటికి చెక్ పెట్టవచ్చు..

మేడిపండు నుండి పండు, పాలు, పొడి రూపంలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు.. ఈ పండు తో పాటు చెట్టు బెరడు పాల వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలిగి ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హేమరాయిడ్స్ తో ఇబ్బంది పడుతున్న వారికి గాయాలు అయితే రక్తస్రావం అవుతుంది.. కాబట్టి కాస్త తడి దూది పైన మేడిపండు కాయ నుంచి వచ్చిన పాలను పూసి ఆ గాయాల పైన ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

నోటి పుండ్లతో బాధపడేవారు మేడిపండు చెట్టు నుంచి బెరడు తో తయారుచేసిన కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలిస్తుంది.. ఎవరికైనా విరేచనాలతో ఇబ్బంది పడుతుంటే మేడిపాలను 8 నుంచి 10 చుక్కలు నీటిలో కలుపుకొని తాగడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు.

మూత్ర సంబంధిత రుగ్మాలతో ఇబ్బంది పడేవారు రోజుకు రెండు చొప్పున మేడిపండ్లను తింటే చాలా ప్రయోజనం కలుగుతుందట..

మధుమేహ వ్యాధి గ్రహస్తులు మేడి పనులను ఎండబెట్టి లోపల ఉండే గింజలను తీసి పొడిగా చేసుకొని.. ఆ పొడితో కలుపుకొని పాలు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

ఎవరైనా బలహీనతతో ఇబ్బంది పడేవారు మాగిన మేడి పనులను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.. అయితే ఎక్కువగా మేడి పనులు తినడం వల్ల కూడా కడుపులో నులిపురుగులు పెరిగా అవకాశం ఉంటుంది.

మేడిపండ్లు చూడడానికి తినడానికి రుచిగానే అనిపిస్తాయి.. ఇవి దొరకని వారు అంజీర పండు తిన్న మంచిదే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: