ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆకు రోజుకు ఒకటి నమిలితే చాలు..!!

Divya
హిందూ సంప్రదాయంలో తమలపాకులకి తమదయిన ప్రత్యేకము ఉంది.దేవుళ్లకు సమర్పించడానికి ముత్తయదువులకు తాంబూలం ఇవ్వడానికి తమలపాకులు వాడుతూ ఉంటాము.అంతేకాక చాలామంది భోజనం తర్వాత, తిన్నది బాగా జీర్ణం కావడానికి కూడా తమలపాకులతో తాంబూలం వేసుకుంటూ ఉంటారు.అంతేకాక  తమలపాకులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవి ఏంటంటే..
చాలామందికి సీజనల్ చేంజెస్ వల్ల దగ్గు జలుబు,కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఒక తమలపాకు తీసుకొని అందులో ఒక లవంగం,రెండు తులసి ఆకులు ఒక యాలుక పెట్టి తాంబూలాగా తాంబూలంలాగా చుట్టుకుని,నమలడంతో ఆ రోగాలన్నీ తగ్గిపోతాయి.ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఎవరైతే చుండ్రు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.అలాంటివారు ఒక తమలపాకు,గుప్పెడు మందార ఆకులు,ఒక స్పూన్ కలబంద గుజ్జు వేసి,బాగా మిక్సీ పట్టుకుని తలకు అప్లై చేసుకోవడంతో,ఎలాంటి జుట్టు సమస్యలైనా ఈజీగా తగ్గించుకోవచ్చు.
తమలపాకులను వెల్లుల్లిపాయలు,చిన్న అల్లం ముక్క, తేనె కలిపి నమలడంతో సిరల్లో రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది.
చిన్న పిల్లల్లో కలిగే జలుబును ఒక తాయాన వదలదు.అలాంటి పిల్లలకు తమలపాకుపై చిటికెడు పసుపు వేసి,వేడి సెగకు ఉంచాలి.ఆ తర్వాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడే నుదుటిపై పట్టులా వేయాలి. ఇంత ఒక్క రోజులోనే ఎటువంటి జలుబు అయినా ఈజీగా తగ్గుతుంది.
భోజనం తర్వాత తమలపాకు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి తిన్నది ఆరోగ్యంగా అరిగిపోతుంది. మరియు ఇది చెడు కొవ్వును కరిగించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఎప్పుడైనా గాయాలైనప్పుడు తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పుడు తమలపాకుని తీసుకొని దానిపై పసుపు,కొంచెం కర్పూరం వేసి గాయాలపై ఉంచినప్పుడు రక్తస్రావం తగ్గడమే కాకుండా గాయాలు కూడా తొందరగా మానిపోతాయి.
తమలపాకులను రోజుకొకటి నమలడంతో చిగుళ్ల నుండి  వచ్చే రక్తస్రావం,చిగుళ్ల వాపు,పళ్ళు పుచ్ఛి పోవడం వంటి సమస్యలకు నివారణ కలగడమే కాకుండా,నోటి దుర్వాసన,కడుపులో నుంచి వచ్చే అపాన వాయువు తగ్గుతుంది.
యూత్ లో మొటిమల వల్ల ముఖం నిండా అల్లుకుపోతూ ఉంటాయి.అలాంటి వారు తమలపాకును మెత్తగా నూరి మొటిమల మీద రాస్తే ముఖంపై ఉండే మొటిమలు,మచ్చలు ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: