ఈ సంకేతాలుంటే పిల్లలకి క్యాన్సర్ ముప్పు ఖాయం?

Purushottham Vinay
ప్రస్తుత జీవనశైలి వల్ల పిల్లల్లో క్యాన్సర్‌ సంభవం పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)  లుకేమియా, బ్రెయిన్ క్యాన్సర్, లింఫోమాస్, ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు మన కళ్ల ముందే వ్యాధితో విలవిలలాడిపోతుంటే చూసి తట్టుకోవడం తల్లిదండ్రులకే కాదు సాటి మనిషికి అసాధ్యం. చికిత్స సమయంలో శరీరంపై కలిగించే తీవ్రమైన ప్రభావాలు, వాటి వల్ల కలిగే నొప్పులను పసి శరీరాలు తట్టుకోలేవు. సరైన అవగాహనతో మెదిలితే పసివాళ్లను ఈ క్యాన్సర్ జబ్బు  నుంచి కాపాడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి.అందుకే శరీరంలో ఏదైనా సమస్య కనిపిస్తే, అది చిన్నదైనా సరే అస్సలు తగ్గొద్దు. ముఖ్యంగా వేగంగా బరువు తగ్గడం, అప్పుడప్పుడు తలనొప్పి లేదా వికారం, కణితులు, అలసట.. వంటి లక్షణాలు కనుక కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు చెప్పే సంకేతాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.మీ పిల్లలు చిన్నపనికే అలసిపోవడం ఇంకా రోజంతా సోమరితనంగా ఉండటం జరిగితే అసలు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి.


శరీరంలో ఏదైనా సమస్య ఉంటేనే ఇలా జరుగుతుంది. క్యాన్సర్ మాత్రమే కాదు, శరీరంలో విటమిన్లు, పోషకాహారలోపం వంటి సమస్యల వల్ల కూడా అలసట చుట్టుముడుతుంది. సాధారణంగా కనిపించే ఈ లక్షణాలను పిల్లలలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.ప్రస్తుత రోజుల్లో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పనిచేస్తుంటాం. ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌ని నిరంతరం చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కంటి నొప్పి వాంతికి కూడా కారణమవుతుంది. పిల్లలు తలనొప్పిగా ఉందని, వికారంగా ఉందని చెప్పినా.. తరచూ వాంతులు చేసుకుంటుంటే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. క్యాన్సర్ మరొక లక్షణం శరీరంలో వాపు. కీళ్లు అకస్మాత్తుగా వాచినా, శరీరంలో ఏదైనా గ్రంథి వాచినా లేదా ఎక్కడైనా కణితి కనిపించినా ముందుగా వైద్యులను సంప్రదించాలి. తరువాత అవసరమైన పరీక్షలు చేయించాలి.పిల్లలు ఒక్కసారిగా అసాధారణ రేటుతో బరువు తగ్గుతున్నట్లయితే వెంటనే జాగ్రత్తగా ఉండాలి. వేగంగా బరువు తగ్గడం అంటే శరీరంలో అంతర్గత సమస్య ఉందని అర్థం. బహుశా ఒక అవయవం సరిగ్గా పని చేయకపోవచ్చు. బరువు తగ్గడం అస్సలు మంచి సంకేతం కాదు. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: