పైల్స్ ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?
ప్రస్తుతం చాలా మంది కూడా పైల్స్ సమస్యతో బాగా బాధపడుతున్నారు. రోజు రోజుకూ ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది.పైల్స్ సమస్య రావడానికి ముఖ్యమైన కారణాల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. పైల్స్ ఉన్నవారు కూర్చోవడానికి, నిల్చోవడానికి కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.అందుకే ఈ సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఈ సమస్య ఖచ్చితంగా మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి పైల్స్ ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పైల్స్ ఉన్నవారు ప్రోటీన్ ఉన్న ఆహారాలను తినకూడదు. ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య మరింత పెరిగి, మంట కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు జీవక్రియపై కూడా దెబ్బ పడే ఛాన్సులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పైల్స్ ఉన్న వారు వీలైనంత వరకూ స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అతిగా తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మసాలాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల ప్రేగు కదలికల్లో అనేక సమస్యలు వచ్చి తీవ్ర నొప్పులకు దారి తీసే ఛాన్సులు ఉన్నాయి.పైల్స్ ఉన్నవారు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వీటిల్లో కెఫిన్ ఉంటుంది. కాబట్టి దీని వల్ల మరింత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కెఫిన్ ఉండే ఆహారాలని తీసుకోకపోవడమే మంచిది.పైల్స్‌తో బాధ పడేవారు ఖచ్చితంగా ధూమపానానికి చాలా దూరంగా ఉండాలి. పైల్స్ సమస్య ఉన్నవారు ధూమపానం చేయడం వల్ల.. జీర్ణ కోశపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.అందువల్ల మరింత పెయిన్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే తప్పకుండా మానుకోవాల్సి ఉంటుంది.