విటమిన్ డి లోపానికి చెక్ పెట్టె డ్రైఫ్రూట్స్ ఇవే..!
ఎండుద్రాక్ష..
ఎండు ద్రాక్షలో కాల్షియం,విటమిన్ డి ,ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి.వీటిని తీపి పదార్థాలకు బదులుగా తినవచ్చు.వీటిని తరచూ తీసుకోవడంతో విటమిన్ డి పొందడమే కాక రోగనిరోధక శక్తిని బలోపేతంచేసుకోవచ్చు.మరియు తక్కువ ఖర్చు కూడా.
ఆప్రికాట్లు..
ఎండబెట్టిన ఆప్రికాట్లు రోజుకు నాలుగైదు తీసుకోవడం వల్ల ,ఇందులోని విటమిన్ ఎ, పొటాషియం,విటమిన్ డి,డైటరీ ఫైబర్ వంటి అనేక పోషకాలకు పుష్కళంగా లభిస్తాయి.100 గ్రాముల ఎండిన ఆప్రికాట్‌లో సుమారుగా 400 mg కాల్షియం లభిస్తుంది.
ప్లమ్స్..
వీటినే ప్రూనే అంటారు.వీటిని తరుచూ తీసుకోవడంతో జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ కె,పొటాషియంతో పాటు విటమిన్ డి పుష్కళంగా లభిస్తుంది.ఈ ప్రూనే చాలా విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉన్నందున ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ గ చెప్పవచ్చు.
బాదాం..
బాదాంలో విటమిన్ డి మరియు విటమిన్ ఈ,కే పుష్కలంగా లభిస్తాయి.కావున వీటిని రోజుకు ఐదు నుంచి ఆరు వరకు తీసుకోవడం చాలా ఉత్తమం.
అత్తి పండ్లను..
ఎండిన అత్తి పండ్లలో మితమైన విటమిన్ డి లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడంతో ఆరోగ్యకరమైన ఎముకల బలానికి కావాలిసిన కాల్షియం,పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కళంగా అందుతాయి. కావున మీరు కూడా విటమిన్ డెఫిషియెన్సీ తో బాధపడుతూ ఉంటే,పైన చెప్పిన డ్రైఫ్రూట్స్ లో ఏదో ఒకటి తినడం అలవాటు చేసుకోండి.