నానబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి ఎంత మంచివంటే ?
మనం ఆహారంగా తీసుకునే వేరు శనగలో ఉండే పోషకాలు అసలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ప్రతి రోజూ గుప్పెడు వేరు శనగ తింటే ఖచ్చితంగా ఎన్నో లభాలు ఉన్నాయి.కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఖచ్చితంగా దూరంగా ఉండొచ్చు. ఇక దీన్ని సామాన్యుని జీడి పప్పుగా కూడా పిలుస్తారు. పల్లీల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కాపర్, ఐరన్, జింక్, కాల్షియం, సెలీనియం, పొటాషియం ఇంకా ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ వీటిని తీసుకుంటే ఆరోగ్యం, చర్మం ఇంకా జుట్టుకి చాలా మంచిది. అయితే వీటిని నానబెట్టి తింటే పోషకాలు ఎక్కువ అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.నాన బెట్టిన వేరు శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా మెండుగా ఉంటాయి.
ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ప్రాణాంతక కణాలను కూడా ఈజీగా నివారిస్తాయి. ఇక ముఖ్యంగా క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా చూస్తాయి. ఈ పల్లీల్లో ఫైటో స్టెరాల్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గిస్తాయి.అలాగే పల్లీల్లో ఉండే పోషకాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి.ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేసే వారికి ఎక్కువగా వెన్ను నొప్పు వేధిస్తుంది. ఇలాంటి వారు నానబెట్టిన వెరు శనగలు తినడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ నాన బెట్టిన వేరు శనగలతో బెల్లం కూడా కలిపి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.అలాగే జ్ఞాపక శక్తిని, కంటి చూపును మెరుగు పరచడంలో వెరు శనగలో ఉండే విటమిన్లు సహాయ పడతాయి. చిన్న పిల్లలు ఇంకా పెద్దల్లో వచ్చే మతి మరుపును నియంత్రించి, అల్జీ మర్స్ రాకుండా చూస్తుంది.ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని కూడా తగ్గిస్తాయి.