దీన్ని తాగితే బాడీ క్లీన్ అయ్యి ఏ రోగాలు రావు?

Purushottham Vinay
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మూలికలల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒకటి. వీటి గురించి మనలో చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరం కూల్ అవ్వడానికి షర్బత్ ల తయారీలో దీనిని వాడుతూ ఉంటారు.బాడీని కూల్ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు చాలా ఇతర ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీనిని వాడడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ సుగంధ పాల వేర్లు మనకు చాలా ఆయుర్వేద షాపుల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిలో నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇక ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.ఇక సుగంధ వేర్లతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సుగంధ వేర్లతో కషాయాన్ని తయారు చేసుకోవడానికి  మనం 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెరడు పొడి, 4 మిరియాలను, 2 యాలకులను, ఒక చిన్న అల్లం ముక్కను ఇంకా 10 పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు ఇంకా యాలకులు వేసి నీటిని బాగా మరిగించాలి.ఆ నీళ్లు మరిగిన తరువాత వడకట్టి అందులో పుదీనా ఆకులు ఇంకా తేనె వేసి కలిపి తాగాలి.ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.


సుగంధ వేర్లతో ఈ విధంగా కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం ఎటువంటి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.సుంగధ వేర్లతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తం బాగా శుభ్రపడుతుంది. మన శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే ఈ కషాయాన్ని తాగడం వల్ల మూత్రాశయ ఇన్పెక్షన్ లు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా సుగంధ వేర్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వీటిని వాడడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: