సోంపు ఆకుల టీ తాగడంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Divya
సాధారణంగా ఏదయినా నాన్ వెజ్ తిన్నప్పుడు,వాసన కలిగిన పదార్థాలను తిన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన రాకుండా సోంపు నములుతూ ఉంటాము.దీనిని తీసుకోవడంతో నోటి దుర్వాసన పోవడమే కాకుండా మనం తిన్న ఆహారం కూడా తొందరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.ఈ సొంపు గింజలే కాక సోంపు ఆకులు ఎన్నో రకాల రోగాలకు నివారిణిగా కూడా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇన్ని ప్రయోజనాలు కలిగిన సోంప్ ఆకుల టీ ఎలా తయారు చేసుకోవాలో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనము తెలుసుకుందాం పదండి..
దీనికోసం ముందుగా 6 నుంచి 8 వరకు సోంపు ఆకులను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి.ఈ ఆకులు మందంగా కలిగి కారంగా ఉంటాయి.వీటిని ఇప్పుడు కట్ చేసి ఒక బాండీలో గ్లాస్ నీటిలో వేసి బాగా ఉడికించుకోవాలి.ఇందులోనే చిన్న ముక్క అల్లం,చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి బాగా ఊడికిన తర్వాత దింపి,  ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనే కలిపి తీసుకోవాలి.ఈ టీ ని కాఫీ,టీలకు బదులుగా వారంలో రెండు మూడు రోజులు తాగొచ్చు.
ఈ సోంపు ఆకుల టీని తీసుకోవడం వల్ల,కడుపు ఉబ్బరంతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.అంతేకాక చాలా తీవ్రమైన దగ్గు జ్వరం జలుబుతో పడేవారు పొద్దున,సాయంత్రం సోంపు ఆకులతో తయారు చేసిన టీ తాగడం ఉత్తమం.అంతే కాక ఈ టీతో కడుపులో గడబిడ,మంట,త్రేన్పులు, ఎక్కిళ్లు,కడుపు నొప్పి,అరుచి,కడుపులో బరువుగా ఉండటం లాంటి సమస్యలకు తొందరగా మంచి నివారణకు కలుగుతుంది.మరియు చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి అధికంగా వచ్చే నులి పురుగుల సమస్య తగ్గుతుంది.ఇంకా మైగ్రేన్‌ తలనొప్పి ఇబ్బంది పడేవారు రోజూ సోంపు టీ రెండు పూటలా తాగుతూ ఉంటే చాలా వరకు తగ్గుతుంది.క్యాలిషియం డెఫిషియన్సీతో వచ్చే సయాటికా నడుము నొప్పి,కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది.అప్పటికప్పుడు ముంచుకొచ్చే ఉబ్బసం,ఆయాసం తగ్గిపోతాయి.కావున మీరు కూడా ఈ సోంపు ఆకుల టీ అలవాటు చేసుకొని, ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: