గుండె జబ్బులని దూరంగా ఉంచే ఆహారాలు ఇవే?

Purushottham Vinay
గుండె జబ్బులని దూరంగా ఉంచే ఆహారాలు ఇవే ?


ప్రస్తుత కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, టెన్షన్‌ ఇంకా ఉద్యోగంలో ఒత్తిడి వంటి కారణాల వల్ల మనిషికి గుండెకు సంబంధించిన వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి.ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం ఇంకా దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, అలాగే దంత వ్యాధులు గుండెజబ్బులకు ఖచ్చితంగా దారితీస్తాయి. అలాగే అస్థిరంగా రొమ్మునొప్పి, రక్తపోటు అధికమవటం ఇంకా గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి.దేశంలో గుండె సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల వల్ల చాలా మంది మరణిస్తున్నారు.వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు ఇంకా తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. 



అలాగే రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును బాగా మెరుగుపరుస్తాయి.అలాగే ఆకు కూరలు గుండెకు చాలా మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను కూడా దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం ఇంకా పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో బాగా సహాయపడతాయి.ప్రతి రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: