మన బాడీలో ఖచ్చితంగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తాన్ని మన రెండు మూత్రపిండాలు గంటకు రెండు సార్లు వడకడుతూనే ఉంటాయి. రక్తంలో ఉన్న కాలుష్యాన్ని, మలినాలను, ఎక్కువగా విటమిన్స్ ను, లవణాలను ఇంకా కెమికల్స్ ను వడకట్టి మూత్రపిండాలు మూత్రం ద్వారా వాటిని బయటకు పంపిస్తూ ఉంటాయి.మూత్రం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లవణాలన్నీ మూత్రంలో కలిపినా కూడా మూత్రం గాఢత తక్కువగా ఉంటుంది. అదే మూత్రం తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యర్థాలన్నీ మూత్రంలో కలవడం వల్ల మూత్రం గాఢత అనేది పెరుగుతుంది. ఎక్కువ గాఢత ఉన్న మూత్రాన్ని మనం విసర్జించినప్పుడు ఆ మూత్రం మండుతూ వస్తుంది.అందువల్ల మూత్రం విసర్జించిన తరువాత కూడా మండుతుంది. అయితే మూత్రం తక్కువగా తయారవ్వడానికి కారణం మనం నీటిని తక్కువగా తాగడమే. ఎందుకంటే నీటిని తక్కువగా తాగడం వల్ల మూత్రం తక్కువగా తయారవుతుంది. అందువల్ల మూత్రం గాఢత పెరిగి మూత్రంలో మంట వస్తుంది. అలాగే మూత్రం కూడా పసుపు రంగులోకి వస్తుంది. అయితే ఇలా మూత్రంలో మంట వచ్చినప్పుడు చాలా మంది వేడి చేసింది అని భావిస్తూ ఉంటారు. మూత్రంలో మంట, వేడి తగ్గడానికి పంచదార కలిపిన నీటిని, మజ్జిగను ఇంకా సబ్జా గింజల నీటిని తాగుతూ ఉంటారు.
అయితే మూత్రంలో మంట తగ్గాలంటే వీటికి బదులుగా నీటిని తాగడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మూత్రంలో మంట రావడానికి కారణం శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడమేనని కాబట్టి నీటిని తాగడం వల్ల మాత్రమే మూత్రంలో మంట, వేడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మూత్రంలో మంట సమస్య తగ్గాలన్నా ఇంకా అలాగే ఈ సమస్య మరలా రాకుండా ఉండాలన్నా ప్రతి రోజూ ఉదయం పరగడుపున లీటర్నర నీటిని తాగాలి. ఇలా తాగిన గంటన్నర తరువాత మరో లీటర్ నీటిని కూడా తాగాలి. ఇక ఇలా అల్పాహారం తీసుకోవడానికి ముందే నీటిని తాగాలి. మళ్ళీ అల్పాహారం తీసుకున్న రెండు గంటల తరువాత నీటిని తాగాలి. ఈ అల్పాహారం తీసుకున్న రెండు గంటల నుండి భోజనానికి మధ్యలో అరగంటకొకసారి ఒక గ్లాస్ చొప్పున మరో లీటర్ నీటిని తాగాలి.ఇంకా అలాగే భోజనం చేసిన రెండు గంటల తరువాత మళ్ళీ అరగంటకొకసారి నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల ప్రతి రోజూ 4 లీటర్ల నీటిని తాగడం వల్ల మూత్రంలో మంట, వేడి తగ్గడంతో పాటు ఈ సమస్య మరలా రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.