కండ్లకలక వల్ల మన కళ్లు ఎర్రగా మారతాయి. కండ్ల నుండి ఎప్పుడు నీరు ఎక్కువగా కారుతుంది. అలాగే కళ్లు ఉబ్బినట్టుగా ఉంటాయి. ఇంకా కళ్లల్లో దురద, మంటలు ఎక్కువగా ఉంటాయి. కళ్ల నుండి పుసి ఎక్కువగా రావడం, కళ్లు తెరవలేకపోవడం ఇంకా కళ్లు మసకగా కనబడడం వంటి వాటిని కండ్లకలక లక్షణాలుగా చెప్పవచ్చు. ఇంకా అలాగే ఈ సమస్యను మనం ఒక అంటు వ్యాధిగా చెప్పవచ్చు.అయితే చాలా మంది కూడా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే కండ్లకలక వస్తుందని భావిస్తారు. కానీ కండ్లకలక అనేది కేవలం స్పర్శ ద్వారా వస్తుంది. కండ్లకలక వచ్చిన వారు వాడిన వస్తువులను ఇంకా దుస్తులను వాడడం వల్ల ఇది ఒకరి నుండి మరొకరికి వస్తుంది. కంటి చుక్కలు వాడడం వల్ల మనకు తక్షణ ఉపశమనం వచ్చినా కూడా ఇది పూర్తిగా తగ్గడానికి మాత్రం ఖచ్చితంగా వారం నుండి రెండు వారాల సమయం పడుతుంది. అయితే ఈ కండ్లకలక వల్ల ప్రాణనష్టం జరగనప్పటికి తీవ్రమైన సందర్భాలలో మాత్రమే కంటిచూపు పోయే ప్రమాదం ఉంది.
అయితే కొన్ని రకాల జాగ్రత్తలు ఇంకా చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి చాలా త్వరగా బయటపడడంతో పాటు ఒకరినుండి మరొకరికి రాకుండా అడ్డుకోవచ్చు.కండ్లకలకతో బాధపడే వారు ఖచ్చితంగా కాంటాక్ట్ లెన్సులను వాడడం మానేయాలి. కంటికి అస్సలు అలంకరణలు చేయకూడదు. ఇంకా అలాగే గోరు వెచ్చని నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి నీటిని పిండి వేయాలి.ఆ తరువాత ఈ వస్త్రాన్ని కండ్లపై ఉంచుకోవాలి. ఇది చల్లారిన తరువాత దానిని తీసి మరలా వేడి నీటిలో ముంచి కళ్లపై వేసుకోవాలి. ఇలా ఒక 10నుండి 15 సార్లు చేయాలి. ఇంకా అదే విధంగా కండ్లకలక ఇతరులకు రాకుండా చేతులను ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా శుభ్రంగా కడుక్కోవాలి.ఇంకా అలాగే మురికి చేతులతో కళ్లను తాకడం, కళ్లను రుద్దడం వంటివి అస్సలు చేయకూడదు.ఇంకా అలాగే ఇతరులతో కనీస దూరం ఖచ్చితంగా పాటించాలి. అలాగే కళ్లదాలు, కాంటాక్ట్ లెన్సులు వంటి వాటిని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ఇక ఈ విధంగా ఈ చిట్కాలను, జాగ్రత్తలను పాటించడం వల్ల కండ్లకలక తగ్గడంతో పాటు రాకుండా ఉంటుందని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.