కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇది వాడండి?

Purushottham Vinay
కండరాలు పట్టేస్తున్నాయా ? అయితే ఇది వాడండి ?

ఇక మన శరీరాన్ని రోజూ కదిలించకుండా ఉంచి ఒకేసారి కదిలించడం వల్ల ఇలా కండరాలనేవి పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాయామాలు చేసినప్పుడు, ఎక్కువగా నవ్వినప్పుడు, బిగుతుగా ఉండే దుస్తులను ధరించడానికి కుస్తీలు పడుతున్నప్పుడు ఇంకా ఎత్తులో ఉండే వస్తువులను అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు కండరాలు పట్టేస్తూ ఉంటాయి.అలాగే కొందరికి అయితే నిద్రలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి.ఈ కండరాలు పట్టేయడం వల్ల తట్టుకోలేని విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది.కొంతమంది ఈ నొప్పిని తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంటారు కూడా. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి ఎక్కువగా మందులు వాడుతూ ఉంటారు. ఎందుకంటే మందులని వాడడం వల్ల ఫలితం ఉంటుంది. కానీ కొంతమంది మందులు వాడకుండా సహజ సిద్దంగా ఈ సమస్య నుండి బయట పడాలని అనుకుంటారు. ఇలా కండరాలు పట్టేసినప్పుడు సహజ సిద్దంగా లభించే పిప్పర్ మెంట్ ఆయిల్ ను రాయడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.


ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ పై కెనడా దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో అద్భుతమైన విషయం వెల్లడైంది. ఎందుకంటే పిప్పర్ మెంట్ ఆయిల్ లో మెంథాల్, మెంథీన్, మెంథిల్ ఎసిటేట్ వంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కండరాలను విశ్రాంతిని కలిగించి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. మనకు ఆన్ లైన్ లో ఈ ఆయిల్ ఈజీగా లభిస్తుంది. అలాగే ఈ ఆయిల్ గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో తీసుకుని రాసుకోవాలి. దీని గాఢత ఇంకా మంటను తట్టుకోలేని వారు మాత్రం కొబ్బరి నూనెలో రెండు లేదా మూడు చుక్కల పిప్పర్ మెంట్ ఆయిల్ ను వేసి కూడా రాసుకోవచ్చు.ఈసారి కండరాలు పట్టేస్తే ఖచ్చితంగా ఈ ట్రై చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: