పిప్పి పన్ను సమస్యని చిటికెలో తగ్గించే టిప్ ఇదే?

Purushottham Vinay
మనలో చాలా మంది కూడా పిప్పి పన్ను సమస్యతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కూడా ఈ సమస్య ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. పిప్పి పన్ను వల్ల కలిగే బాధ, నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.అయితే ఈ పిప్పి పన్ను సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మన నోటిలో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోవడమే. మనం తీసుకునే ఆహారమే మన నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగేలా చేయడంలో బాగా సహాయపడుతుంది. కాఫీ, టీ లను ఎక్కువగా తాగడం, చక్కెర ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం, జంక్ పుడ్ ను ఎక్కువగా తీసుకోవడం ఇంకా అలాగే ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోకపోవడమే మన దంతాలు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం.మన నోట్లో ఉండే బ్యాక్టీరియా మనం తీసుకునే ఆహారంలో ఉండే చక్కెరలతో కలిసి బాగా వృద్ది చెందుతుంది. ఇక ఈ బ్యాక్టీరియా దంతాలపై పేరుకుపోయి దంతాలు గార పట్టేలా అలాగే దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది. అందుకే మన దంతాలపై గార పోగొట్టుకోవడానికి, పిప్పి పన్ను సమస్యను తొలగించుకోవడానికి మనం చాలా రకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటాము.



కానీ ఎలాంటి ఫలితం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. టూత్ పేస్ట్ లను వాడే పని లేకుండా చాలా తక్కువ ఖర్చులో సహజంగా లభించే పదార్థాన్ని ఉపయోగించి మనం పిప్పి పన్ను సమస్య నుండి చాలా ఈజీగా బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో బత్తాయి పండు మనకు చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బత్తాయి జ్యూస్ ను తాగితే మాత్రం మనం ఈ ఫలితాన్ని పొందలేము. కేవలం చక్కగా పండిన తియ్యటి బత్తాయి తొనలను నమిలి తింటేనే మనం ఈ ఫలితాన్ని పొందగలము. ఎందుకంటే బత్తాయిలో ఉండే ఆమ్లత్వం నోట్లో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను తొలగించి, దంతాలు పుచ్చిపోకుండా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే దీనిలో ఉండే ఫైబర్ దంతాలపై ఉండే గారను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. బత్తాయి తొనలను నమిలి తినడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గార ఈజీగా తొలగిపోతుంది. అయితే నోటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోరు బాగా శుభ్రపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: