క్యాబేజీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Purushottham Vinay
క్యాబేజీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?


ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలి కారణంగా చాలా ఈజీగా వ్యాధుల బారిన పడుతున్నాము. ఆరోగ్యంగా వుండాలంటే ఖచ్చితంగా కొన్ని ఆరోగ్యకరమైన టిప్స్ పాటించాలి.పచ్చని ఆకు కూరలు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. క్యాబేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు లభిస్తాయి. ఇంకా అలాగే ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది, మీకు డయాబెటిస్ సమస్య ఉన్నట్లయితే ,గ్లూకోజ్ స్పైక్ భయం ఉంటే, క్యాబేజీని రెగ్యులర్ డైట్‌లో తినడం అలవాటు చేసుకోండి.ఎందుకంటే ఈ కూరగాయలలో యాంటీహైపెర్గ్లైసీమిక్ ప్రభావాలు ఉన్నాయి.ఇవి చక్కెరను ఈజీగా తట్టుకోగలవు. ఇంకా అలాగే ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయి.



ఇక మారుతున్న సీజన్‌లో, ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది, దీని వల్ల జలుబు-దగ్గు, జలుబు, వంటి చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో, మీరు మీ రెగ్యులర్ డైట్‌లో క్యాబేజీని చేర్చుకోవాలి. అందువల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ప్రస్తుత కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది, దానిని నివారించడానికి మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక అటువంటి పరిస్థితిలో, క్యాబేజీ మీకు మంచి ఎంపికగా నిరూపించబడుతుంది. ఎందుకంటే దానిలో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల మీ పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరగదు.ఇంకా అలాగే ఈ క్యాబేజీలో ఫైబర్, ఆంథోసైనిన్, పాలీఫెనాల్ పుష్కలంగా ఉన్నందున మన జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మీకు మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ లేదా పొట్టకు సంబంధించిన ఏదైనా సమస్య కనుక ఉంటే, ఖచ్చితంగా క్యాబేజీ తినడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: