గుమ్మడి గింజలు రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?

Purushottham Vinay
గుమ్మడి గింజలనేవి మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో  ఒకటి. ఇవి చూడడానికి చిన్నగా వున్నా కానీ వీటిలో పోషకాలు మాత్రం చాలానే ఉంటాయి.ఈ గింజలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. గుమ్మడి గింజలు మన శరరానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో చాలా బాగా సహాయపడతాయి. మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..ఇంకా అలాగే వీటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.ఇంకా వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల స్త్రీలల్లో రొమ్ము క్యాన్సర్ ఇంకా పురుషుల్లో ప్రోస్టేస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.ఇంకా అలాగే గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఈజీగా అదుపులో ఉంటాయి.అలాగే వీటిలో ఫాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి ఈ గింజలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.



ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి చెడుకొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా ఈ గింజలను తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రతి రోజూ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కూడా చక్కగా అందుతాయి. ఇంకా అలాగే నిద్రలేమితో బాధపడే వారు ఈ గింజలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అదే విధంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఇక ఈ గుమ్మడి గింజలను మనం ప్రతి రోజూ అర కప్పు మోతాదులో తీసుకోవచ్చు. ఇంకా అలాగే వీటిని ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో కూడా తీసుకోవచ్చు.ఇక ఈ గింజలను పచ్చిగా లేదా ఏమి వేయకుండా దోరగా వేయించి కూడా తీసుకోవచ్చు. అయితే అవి మన శరీరానికి మేలు చేసేవే అయినప్పటికి ఈ గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఇంకా మలబద్దకం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: