వేసవిలో ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది?

Purushottham Vinay
పుదీనా అనేది కేవలం రుచిని మాత్రం పెంచడమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య గుణాలని కూడా కలిగి ఉంటుంది.పుదీనా ఆకుల ఉపయోగం వేసవిలో ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఎందుకంటే ఇది చాలా రకాల వ్యాధుల్ని దూరం చేస్తుంది.  పుదీనాలో విటమిన్ సి, ప్రోటీన్లు, మెంథాల్, విటమిన్ ఎ, కాపర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. దీని వల్ల వేసవిలో గ్యాస్, వికారం వంటి సమస్యలు  అస్సలు దరిచేరవు. పుదీనా ఆకుల్ని ఏదో ఒక  తీసుకోవడం వల్ల చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.ఈ పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఫలితంగా తరచూ తలనొప్పి సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే చాలామందికి కూడా వేసవిలో తీవ్రమైన తలనొప్పి సమస్య వెంటాడుతుంటుంది.ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు తాజా పుదీనా ఆకులు చాలా అద్భుతంగా అరోమోథెరపీలా పనిచేస్తాయి.ఈ పుదీనా ఆకుల సువాసనే సగం నొప్పిని ఈజీగా తగ్గించేస్తుంది.


పుదీనా ఆయిల్ లేదా పుదీనా బామ్ తో మాలిష్ చేయవచ్చు.అలాగే స్థూలకాయం బాధితులకు కూడా పుదీనా అద్భుతమైన చికిత్సలా పనిచేస్తుంది. పుదీనా ఆకులతో బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. పుదీనా ఆకులను ఏ రూపంలో తీసుకున్నా కూడా ఫరవాలేదు గానీ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. పుదీనా ఆకులతో చట్నీ, పుదీనా నీళ్లు, పుదీనా టీ తయారు చేసుకొని సేవిచంవచ్చు. దీనిల్ల బరువు చాలా వేగంగా తగ్గించుకోవచ్చు. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నల్ల మిరియాల పౌడర్ కలుపుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.వేసవి కాలంలో సాధారణంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. కడుపు సంబంధిత ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడతాయి. పుదీనా ఆకులతో ఈ సమస్యల్నించి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అజీర్తి సమస్యల్నించి ఉపశమనం కల్గించేందుకు చాలా అద్భుతంగా దోహదపడతాయి.అలాగే పుదీనా నీళ్లతో కూడా ఈ ప్రయోజనాలని మనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: