బొల్లి మచ్చలు రావడానికి అసలు కారణం ఇదే..!

Divya
బొల్లి ఒక చర్మవ్యాధి అని అందరికీ తెలిసినదే. బొల్లి వ్యాధి వలన చర్మం పై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఆ తెల్ల మచ్చలు ఏమిటంటే మన బాడీలో మెలనోసైట్స్ లో లోపాలు జరగడం వల్ల అవి దెబ్బతిని చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. అంటే మన బాడీలో ఏ ప్రదేశంలో మెలనిన్ తయారు అవ్వదో అక్కడ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. చర్మం లో ఉండే మిగిలిన కణాలు దెబ్బతిన్నాయి అంటే అవి మృతి చెందడం కానీ, చర్మానికి హాని జరగడం వల్ల కానీ జరుగుతుంది. అంటే ఆ చర్మంపై కొన్ని ప్రదేశాలలో పిగ్మెంట్ ఏర్పడడం జరగదు.

ఈ మచ్చలు తెల్లగా ఉంటాయి. కాబట్టి తెల్ల మచ్చలు అని అంటాము. కానీ కొందరిలో తెలుపుతో పాటు ఎరుపు కలిపి ఉండవచ్చు. సమస్య తీవ్రత పెరిగితే మచ్చలు తెల్లగా మారుతూ ఉంటాయి. ఈ సమస్య జెనటిక్ ద్వారా వస్తుంది. జీన్స్ వల్లే కాకుండా సంపూర్ణ ఆటో ఇమ్యూన్ వ్యాధులు.. సున్నితమైన చర్మం  ఉన్నవాళ్లకు కూడా వీటి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఎవరిలో అయితే  గ్లూటాథియోన్  లెవెల్స్ తక్కువగా ఉంటాయో వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఇలాంటి వ్యాధి  ఉన్నవాళ్లు చాలా కృంగిపోతుంటారు. వీళ్లు మానసిక ఆందోళనకు ఎక్కువగా గురి అవుతుంటారు.  వీళ్లు బయటకు రావాలన్న, పక్కవారితో మాట్లాడాలన్నా చాలా బాధపడుతూ ఉంటారు. అలానే పక్క వాళ్ళు కానీ వీళ్ళతో మాట్లాడాలన్నా, వీళ్ళ దగ్గర కూర్చోవాలన్నా భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలు ఏమి అవసరం లేదు. ఇది అంటువ్యాధి కాదు, వాళ్ళ బాడీలో లోపం వల్ల కానీ, జనటిక్ వల్ల కానీ ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు అసలు భయపడాల్సిన అవసరం లేదు.అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.. ఇలాంటివి వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: