చలికాలంలో గుండె ప్రమాదాలు రాకుండా ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చలికాలంలో గుండె ప్రమాదాలు రాకుండా ఇలా చెయ్యండి?

చలికాలంలో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చేయాలి. దీనివల్ల గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. వాకింగ్‌, జాగింగ్‌ వంటి వాటిని కొనసాగించాలి. అయితే ఉదయం పూట మంచు కురిసే సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడం ఉత్తమం. చలికాలంలో రక్తపోటను క్రమం తప్పకుండా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. బీపీలో అనూహ్య మార్పులు కనిపిస్తే తగిన చికిత్స తీసుకోవాలి.సాధారణంగా చలికాలం నీరు తక్కువ తాగుతుంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపడ నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జాగా పండ్లు, కూరగాయలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.సహజంగానే ఆల్కహాల్‌ శరీరంలో రక్తప్రసరణను ప్రభావితం చేస్తుందనే విషయం తెలిసిందే. ఆల్కహాల్‌ శరీరాన్ని వేడి చేస్తుంది. శరీరంలో వేడి, బయట చల్లటి వాతావరణం ఉండడం కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


వింటర్‌లో కచ్చితంగా ఉన్ని దుస్తువులను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల, చేతులు, పాదాలను కవర్‌ చేస్తూ క్యాప్‌, గ్లౌజ్‌లు వంటి వాటిని ధరించాలి.చలికాలంలో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా ఉదయం 8 గంటలకు ముందు రాత్రి 6 గంటల తర్వాత బయట తిరగకుండా ఉండాలి.చలికాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చలి కాలం గుండె జబ్బు వున్న వారికి ఎంతో కీడు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఈ కాలంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వుండండి. పైన చెప్పిన చిట్కాలు ఖచ్చితంగా పాటించండి. ఎలాంటి జబ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: