టిల్లు సిరీస్ లానే ఇస్మార్ట్ సిరీస్ యూత్ కి కనెక్టవ్వడం పక్కా?

Purushottham Vinay
రామ్, పూరీ జగన్నాధ్ కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దీనికి సీక్వెల్ గా వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా కూడా ఒక్క టీజర్ తో రెట్టింపు అంచనాలు పెంచేసింది.ఇస్మార్ట్ శంకర్ సినిమా లాగానే, డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా స్పిర్చువల్ టచ్ తో కూడిన మ్యాసీవ్, యాక్షన్-ప్యాక్డ్ క్లైమాక్స్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయి. అద్భుతమైన శివలింగం, క్లైమాక్స్ ఫైట్లో జరిగే భారీ జనసమూహం గూస్బంప్లను తెప్పించింది. టీజర్ ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్తో ఇస్మార్ట్ మ్యాడ్ నెస్ని చూపించింది.ఈ సినిమాతో ప్రేక్షకులకు డబుల్ డోస్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ని అందించారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన హీరో రామ్ ని బెస్ట్ స్టైలిష్, మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో ప్రజెంట్ చేశారు. యూనిక్ హైదరాబాదీ యాసలో ఉన్న వన్-లైనర్లు కూడా ఆద్యంతం అలరించాయి. ఇటీవల టిల్లు సిరీస్ లో కూడా ఈ వన్ లైనర్ డైలాగులో బాగా పేలాయి.అలానే ఈ సినిమా కూడా పక్కా హిట్టు కొట్టడం ఖాయం అనిపిస్తుంది.


పైగా పూరి జగన్నాథ్ టేకింగ్ కూడా తన పాత సినిమాల చాలా స్టైలిష్గా ఉంది. కంటెంట్ డబుల్ యాక్షన్, డబుల్ ఎనర్జీ, డబుల్ ఫన్ కి అనుగుణంగా ఉంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ లో రెట్టింపు నైపుణ్యంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఎనర్జిటిక్ యాక్టింగ్, ఆన్ స్క్రీన్ చరిష్మా అన్నీ కూడా టీజర్ లో ఎక్స్ ట్రార్డినరీగా ఉంది.హీరోయిన్ కావ్య థాపర్ కూడా చాలా గ్లామర్గా కనిపించింది.  ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సీనియర్ నటుడు అలీని ఫన్నీ రోల్లో చూడటం చాలా రోజుల తరువాత మంచి ఫీలింగ్ కలిగించింది. ఎందుకంటే పూరీ, అలీలది ఎవర్ గ్రీన్ హిలేరియస్ కాంబినేషన్. శ్యామ్ కె నాయుడు, జియాని గియాన్నెలీల విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.మెలోడీ గాడ్ మణిశర్మ బ్యాక్ మ్యూజిక్ అదిరిపోయింది. టిల్లు సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇవే అంశాలతో యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా 100 కోట్ల నుంచి 200 కోట్లు వసూళ్లు చెయ్యడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: