రామ్ చరణ్ కోసం ఏకంగా ఆ బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు..!?

Anilkumar
రామ్ చరణ్
 నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .ఇక ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. కాగా ఈ సినిమా విడుదలైన తరువాత వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను సైతం పూర్తి చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా

 విడుదలైన వెంటనే బుచ్చిబాబు సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమా సర్టిఫై కి వచ్చేలోపే సినిమాకి సంబంధించిన అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలి అని ప్రస్తుతం బిజీగా ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇప్పటినుండి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా

 నటిస్తోంది .అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే రామ్ చరణ్ జాన్వి కపూర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అమితాబచ్చన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారట. అయితే అమితాబచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. కానీ ఆయన ఎటువంటి పాత్రలో కనిపిస్తారు అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమాలో ఆయన ఎటువంటి పాత్రలో కనిపిస్తారు అన్న సందేహం నెలకొంది. ఇకపోతే అమితాబచ్చన్ ఇప్పుడు కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారు. కనుక ఈ సినిమాలో సైతం ఆయన పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: