బాదం తొక్క ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

Purushottham Vinay
బాదం పప్పు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదం లో ఉండే ప్రోటీన్స్, పోషకాలు ఆరోగ్యాన్ని అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇక బాదం తొక్కలు మేలు చేస్తాయి. బాదం తొక్కలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టును స్ట్రాంగ్‌గా చేయడానికి గుడ్లు, తేనె, అలోవెరా జెల్‌, బాదం తొక్కలను కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను హెయిర్ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ను 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచి.. ఆ తరువాత మంచి నీటితో క్లీన్ చేసుకోవాలి.బాదం తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. మన చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది. కొన్ని రకాల చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుంది. బాదం తొక్కలను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేస్తే.. మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది చర్మాని మంచి పోషణనిస్తుంది. అలాగే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.దంతాలకు సంబంధించిన సమస్యలకు బాదం తొక్క ఉపయోగకరంగా ఉంటుంది. 


అనేక రకాల దంత సమస్యలకు బాదం తొక్కలను ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బాదం తొక్కలను వేడి చేసి, వాటిని పొడిగా చేయాలి. ఆ ఫౌడర్‌ను దంతాలకు అప్లై చేయాలి. ఇది దంత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.తల, జుట్టులో దురద, పేను సమస్య ఉంటే.. బాదం, బాదం తొక్క ఉపయోగించడం ద్వారా చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆయుర్వదం ప్రకారం.. బాదం తొక్కలను పేస్ట్ చేసి తలకు రాసుకుంటే.. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.చాలా మంది చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే అది శరీరం అంతా వ్యాపించి.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లయితే.. బాదం పప్పు తొక్కలను పేస్ట్ చేసి అలెర్జీ ఉన్న ప్రదేశంలో రాయాలి. మొటిమలు, కురుపులకు కూడా ఇది వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: