బద్ధకం, అలసటకి కారణాలు ఇవే.. అవి మానుకోండి?

Purushottham Vinay
యాక్టీవ్ గా ఉంటేనే ఎంతైటి కష్టమైన పనినైనా చాలా ఈజీగా చేయగలుగుతాం. అయితే కొంతమంది మాత్రం చిన్న చిన్న పనులను కూడా అసలు చేయలేకపోతుంటారు. ఆహారం తిన్నా.. లేజీగా ఇంకా అలసిపోయినట్టుగానే కనిపిస్తారు. అయితే ఇలా కనిపించడానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..శరీరంలో ఇనుము లోపిస్తే కూడా బాగా బాగా అలసటగా అనిపిస్తుంది. రోజంతా కూడా అలసిపోయినట్టుగానే ఉన్నా ఇంకా నిద్రపోయినా అలసిపోతున్నట్టైతే మీ ఒంట్లో ఇనుము లోపం ఏర్పడిందని అర్థం చేసుకోండి. ఇందుకోసం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోండి.ఇంకా అలాగే నిద్రలేమి కూడా అలసటకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా కూడా అలసిపోయిట్టుగానే ఉంటారు. సోమరితనం, అలసట ఇంకా ఆస్తమ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే మీరు రాత్రి పూట ఖచ్చితంగా కంటి నిండా నిద్రపోవాలి. ఒక వేళ రాత్రిళ్లు నిద్రలేకపోతే.. ఆ రోజంతా కూడా లేజీగా ఉంటుంది.ఇంకా అలాగే ఒత్తిడి కూడా అలసటకు పెద్ద కారణమవుతుంది.


తరచుగా ఒత్తిడికి గురైతున్నట్టైతే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించండి. లేదంటే ఖచ్చితంగా ధ్యానం చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా అలాగే అలసటను కూడా దూరం చేస్తుంది.ఇంకా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే కూడా శరీరం బద్దకంగా, బలహీనంగా, అలసిపోతుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలను తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటివల్ల శరీరంలో ప్రోటీన్లు ఇంకా విటమిన్ల లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరం అలసిపోతుంది. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా సూచిస్తున్నారు.మన శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామంతోనే శరీరం ఆరోగ్యంగా ఇంకా ఫిట్ గా ఉంటుంది. అలా అని ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే మాత్రం చాలా విపరీతంగా అలసిపోతారు. అంతేకాదు ఓవర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆరోగ్య నిపుణుడి సలహా తీసుకుని వ్యాయామం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: