ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నట్లే?

Purushottham Vinay
ప్రపంచంలో చాలా రకాల వ్యాధులకు మందులు కనిపెట్టడం జరిగింది.కానీ క్యాన్సర్‌ వంటి చాలా ప్రమాదకరమైన వ్యాధులకు ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు.ఇక ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది కూడా ఈ వ్యాధికి బాగా లోనవుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు దాకా ఈ సమస్యకు గురవుతున్నారని నివేదికలు కూడా తేల్చి చెప్పాయి. అయితే ఇక ఇటీవలే ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ వ్యాధి కారణంగా మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా కూడా రెండవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా చాలా మంది ప్రోస్టేట్, పొట్ట, కొలొరెక్టల్, లివర్, థైరాయిడ్ ఇంకా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడడం విశేషం.ఇక చాలా మందిలో కూడా ఈ మారుతున్న సీజన్‌ కారణంగా దగ్గు ఓ సాధరణమైన సమస్య. కానీ ఇలాంటి సమస్య ఒక నెల నుంచి రెండు నెలలు ఉంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణం అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


అలాగే ప్రస్తుతం చాలా మంది కుటుంబ, సామాజిక ఇంకా ఆర్థిక కారణాల వల్ల డిప్రెషన్(Depression) గురవుతారు. ఇదీ మీలో తరుచుగా కనిపిస్తే క్యాన్సర్ లక్షణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా మెదడులో కణితి ఉన్నప్పుడు టెన్షన్, స్ట్రెస్ ఇంకా డిప్రెషన్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి.అలాగే చాలా మందిలో పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఇలాంటి సమస్యతో బాధపడతారు. కానీ ఎలాంటి వ్యాధి లేనప్పుడు కూడా రక్తం అనేది వారికి తరచుగా వస్తే.. మల లేదా పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.అలాగే నిరంతర వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడం అనేది అందరికీ సాధారణం. ఎలాంటి వ్యాయామం లేకుండా కూడా బరువు తగ్గినట్లయితే.. అది ఖచ్చితంగా క్యాన్సర్‌కు మొదటి సంకేతంగా భావించవచ్చు.కాబట్టి ఖచ్చితంగా పైన సంకేతాలు మీకు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి.ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: