మూత్రం నుండి రక్త స్రావం జరుగుతోందా.. కారణం..?
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం జీవనశైలి సరిగా లేకపోవడం ధూమపానం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వారు.. ఎక్కువగా కిడ్నీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మూత్రంలో రక్తం రావడం ప్రారంభమవుతుంది. కిడ్నీ లో కణితి ఏర్పడడం వల్ల ఈ కణతి క్రమంగా పెరుగుతూ శరీరంలో పెద్దగా ఏర్పడుతుంది. దీంతో మూత్రంలో రక్తం తో పాటు నడుము కింద భాగంలో నిరంతరం నొప్పి, ఆకలి వేయకపోవడం, కాళ్ల వాపు, బరువు తగ్గడం వంటివి క్యాన్సర్ లక్షణాలని చెప్పవచ్చు.
ఎక్కువగా మధుమేహం , ఊబకాయం వంటి సమస్యలు ఇబ్బంది పడే వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. అయితే మొదటి లక్షణాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని వైద్యులు తెలియజేస్తున్నారు. మూత్రం రంగు మారడం, మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడడం, కిడ్నీ వ్యాధికి సంకేతం అని చెప్పవచ్చు. ఈ వ్యాధిబారిన కేవలం 40 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఈ వ్యాధి నివారించాలంటే ధూమపానం, బీపీని అదుపులో ఉంచుకోవడం, ప్రతిరోజు వ్యాయామం, శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంచుకోవడం వంటివి చేయాలి.