అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడే అయిదు చిట్కాలు...?
1. ఉదయాన్నే అల్పాహారంలో అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ల కన్నా ప్రోటీన్ జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేయాల్సి ఉండటం వలన ఇది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.
2. అలాగే ఆహారంలో బరువును తగ్గించే ఆహారం అనగా పప్పుధాన్యాలు, బీన్స్, అధిక ఫైబర్, అలాగే తక్కువ కేలరీలు ఆకు కూరలలో కనిపిస్తాయి. ఇది ప్రోటీన్ ఫైబర్ కు సంబంధించినటువంటి మంచి వనరులు. అంతేకాదు బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది.
3. మంచి నిద్ర .. తక్కువగా నిద్ర పోవటం అనేది ఆకలిని తగ్గించే హార్మోన్ను తగ్గించి ఆకలిని ఇంకా పెంచుతుంది. కావున రోజుకి సగటున మనిషి 8 గంటల వరకు నిద్రపోవటం చాల మంచిది.
4. ఆహారాన్ని నెమ్మదిగా తినడం..ఆహారం జీర్ణమయ్యే హార్మోన్ గ్రెలిన్, ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్ల నుండి సంకేతాలను మెదడుకు చేర్చడానికి 20 నిమిషాలు పడుతుందట. మరి అటువంటి పరిస్థితిలో, ఆహారాన్ని వేగంగా తినడం ద్వారా,ఆ సిగ్నల్ మెదడుకు చేరుకునే లోపే ఎక్కువ కేలరీలను తీసుకుని బరువు తగ్గటం కష్టం అవుతుంది. అందువలన ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవటం కూడా ఒక భాగమే అంటున్నారు నిపుణులు.
5. అలాగే బరువు తగ్గాలి అనుకునే వారు చక్కెర పానీయాలు, అలాగే పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఎందుకు అంటే చక్కెర,పండ్ల రసాలు బరువు నియంత్రణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.