పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నారా.. పేగు మడత పడొచ్చు.. జాగ్రత్త?

praveen
పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం అంటూ ఉంటారు కదా.. అచ్చంగా ఇలాగే చిన్న పిల్లలను చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పెద్దయ్యాక మాట్లాడటం తెలిసాక  తమకు ఏమవుతుంది అన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగలరు పిల్లలు. కానీ నెలల వయస్సు ఉండే పిల్లలు తమకు ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పలేరు. కడుపులో నొప్పి వచ్చిన జ్వరం వచ్చినా కేవలం ఏడవడం మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకే చిన్న పిల్లలను ప్రతి క్షణం కాచుకుంటూ ఉండాలి. ఈ క్రమంలోనే చిన్నపిల్లలు  ఏం చేస్తున్నారు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి.

 అయితే కొన్ని కొన్ని సార్లు చిన్న పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఆహారం అరగక కడుపులో నొప్పి రావడం వల్లే ఇలా ఏడుస్తు ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మరింత పెద్ద సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక పెద్దపేగులో చిన్న పేగు జారి పోయే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు  నిపుణులు. ఇక మరి ఇలా జరగడానికి అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పేగు పెద్ద పేగు లోకి వెళ్లడం కానీ లేదా చిన్నప్రేగు చిన్నప్రేగు లోకి వెళ్లి పోవడం ద్వారా ఒకదానికొకటి మడత పడుతూ ఉంటాయి.

 అదే పనిగా చిన్న పిల్లలు ఏడుస్తున్న లేదా జిగురుతో కూడిన రక్తవిరేచనాలు అవుతున్న ఇక ఇలా జరిగింది అని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ఆరు నెలలు పాటు తల్లిపాలు ఇవ్వాలి. కానీ కొంతమంది తల్లులు మూడోనెల నుంచి ఘనఆహారం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఆహారం జీర్ణం కాకపోవడంతో ఘన ఆహారం బరువు కారణంగా చిన్న పేగు పెద్ద పేగు లోకి జారినట్లు అవుతుందట. ఇలాంటివి జరిగినప్పుడు ఎంతలా సముదాయుంచిన పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారట. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించి శస్త్ర చికిత్స చేయడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: