రక్తహీనత తో బాధపడుతున్న వారికి.. ఇది తాగితే చాలు..!!

Divya
శరీరంలో రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అని అంటారు. ఆ కారణంగానే మనిషి చాలా బలహీనంగా ఉంటారు. అలాంటి వారు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ వారి శరీరం లోపల జీవం ఉండదు. కొన్నిసార్లు బలహీనత అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీంతో చర్మం, రంగు పసుపు రంగులో మారడం ప్రారంభమవుతుంది. అలాగే గోర్లు తెల్లబడడం, రక్తహీనతకు ప్రధాన కారణం. శరీరంలో ఇనుము పోషకాల కొరత చాలా సంభవించినప్పుడు ఇలాంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి. రక్తహీనత అనేది ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. ఈ వేసవి కాలంలో రక్తహీనత సమస్య తో బాధపడే వారు కేవలం ఈ జ్యూస్ రసాన్ని తాగితే చాలు. దీంతో హిమోగ్లోబిన్ అమాంతం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
1). ద్రాక్ష రసం:
ద్రాక్షను ఎలాగైనా తినవచ్చు లేదంటే.. వాటిని రసంగా చేసి నల్లటి ఉప్పు వేసుకొని తాగడం వల్ల ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
2). మామిడి కాయలు తినడం:
మామిడి పండు తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తొలగిస్తాయి. ప్రతిరోజు ఒక మామిడి పండు తిని.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల.. శరీరంలో రక్తం పుష్కలంగా ఉంటుంది.
3). దుంప రసం:
బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని రక్తహీనతను తగ్గిస్తుంది. అందుచేతనే  రక్తహీనత ఈ సమస్య తో బాధపడే వారు బీట్ రూట్ జ్యూస్ ను తాగడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
4). కలబంద జ్యూస్:
ఈ కలబంద జ్యూస్ వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీని వినియోగం చర్మం, జుట్టు ఊడిపోవడం, ఇతర సమస్యల నుండి ఈ జ్యూస్ బయట పడవేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవ్వడమే కాకుండా హిమోగ్లోబిన్ పెంచేలా చేస్తుంది.
వీటన్నిటిని ట్రై చేయడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: