ఆ కేంద్రమంత్రితో జగన్ మంతనాలు.. రహస్యం ఇదే?

Chakravarthi Kalyan
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ అక్కడ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత సీఎం జగన్ కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో  వైద్యకళాళాలలకు అనుమతులపై చర్చించారు. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అందించారు. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడిందని సీఎం జగన్ తెలిపారు.


ఏపీ ప్రజలు ఉన్నత  వైద్యం కోసం  హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం జగన్ తెలిపారు. – కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించిన విషయాన్ని  ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందన్న సీఎం జగన్ .. ప్రాథమిక, ద్వితీయ స్థాయిల్లో ఆస్పత్రులను మెరుగుపరుస్తోందని.. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, డీహెచ్‌లు, అంతేకాక ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌ కాలేజీలను అభివృద్ధి చేస్తోందని వివరించారు.


ఏపీ ప్రభుత్వం గణనీయ రీతిలో ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోందన్న సీఎం జగన్..  ప్రతి జిల్లాలకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యాధునిక వైద్యంకోసం అవసరమైన నిపుణులు, ఆరోగ్య సేవలు అందించే మానవవనరులు తయారవుతాయని వివరించారు. ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని.. మొత్తంగా ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయని.. రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్‌కాలేజీలు ఉండగా, కేంద్రం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చామని సీఎం జగన్  తెలిపారు. కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: