ఈ తప్పులు చేస్తే అధిక బరువు పెరగడం ఖాయం!

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతూ ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. అధిక బరువు చాలా ప్రమాదకరం.చాలా మంది కూడా అధిక బరువు సమస్యతో తెగ బాధపడుతూ వుంటారు.ఈ రోజుల్లో అధిక బరువు వల్ల అధిక రక్తపోటు, డయాబెటీస్‌ ఇంకా అలాగే గుండె జబ్బులకి గురవుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. అయితే చాలామంది కూడా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. దీనివల్ల వారు విపరీతంగా బరువు పెరుగుతారు. కాబట్టి మీ బరువు పెరగడానికి ప్రధాన కారణాల గురించి తెలుసుకోండి.బరువు పెరగడానికి అతి పెద్ద కారణం ఏంటంటే బయటి ఆహారం తీసుకోవడం. ఆకలి వేసినప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల అధిక బరువు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు కూడా గురవుతారు.అలాగే రాత్రంతా మేల్కొని ఉండే అలవాటు ఖచ్చితంగా అధిక బరువు పెరగడానికి దారి తీస్తుంది.ఇక నేటి యువత రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. దీని కారణంగా చాలా ఎక్కువ బరువు పెరుగుతున్నారు. సరిపడా నిద్ర కనుక లేకుంటే ఎక్కువగా ఆహారం తింటారు. అందువల్ల విపరీతంగా బరువు పెరుగుతారు.


అలాగే శీతల పానీయాలు తాగే అలవాటు కూడా మీ బరువుని బాగా పెంచుతుంది.వేసవి కాలంలో శీతల పానీయాలు తాగే వ్యక్తులు ఖచ్చితంగా వారి ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.ఎందుకంటే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.ఇవి ఖచ్చితంగా బరువు పెరగడానికి దారితీస్తాయి.ఇక నేటి జీవనశైలిలో చాలామంది కూడా అసలు ఒకే చోట గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు. దీని కారణంగా చాలా ఎక్కువగా బరువు పెరుగుతున్నారు. అందుకే ఒకే చోట గంటల తరబడి అసలు కూర్చోకూడదు. మధ్య మధ్యలో కాస్త లేచి అటు ఇటు నడుస్తూ తిరుగుతూ ఉండాలి.కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పనులు అస్సలు చెయ్యకండి. లేదంటే ఖచ్చితంగా అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: