పంటి నొప్పి సమస్య ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సమస్య వచ్చిందంటే అసలు ఒక పట్టానా తగ్గదు. పన్ను జివ్వంటూ లాగడం బాబోయ్ అసలు ఆ బాధ భరించటం చాలా కష్టం. తగ్గిపోవడం కూడా అంత సులభం కాదు. దీనికి ప్రధాన కారణం అసలు ఏంటి అంటే మనం తినే ఆహారం దంతాలలో పేరుకుపోయినప్పుడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి అది పంటి నొప్పికి కారణం అవుతుంది.ఇక పంటి నొప్పి చాలా ఎక్కువగా ఉన్నప్పుడూ ఏ పని చేయాలన్న ఆసక్తి కూడా అసలు ఉండదు. పంటి నొప్పిని తగ్గించటానికి చాలా మంది కూడా పళ్ళ డాక్టర్ ని సంప్రదిస్తారు. అయితే అంత అవసరం కూడా లేదు. పంటి నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు ఈ ఇంటి చిట్కా అనేది చాలా బాగా పనిచేస్తుంది.మనకు ప్రకృతి ప్రసాదించిన జామ ఆకు అనేది పంటి నొప్పిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ఈ జామ ఆకులు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. జామ ఆకులు పంటి నొప్పికి చాలా ఈజీగా చెక్ పెడతాయి.
ఒక గ్లాస్ నీటిని తీసుకొని వాటిని గినెల్లో పోసి పొయ్యి మీద పెట్టి దానిలో జామ ఆకులను మూడు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగించాలి. ఇక ఈ నీటిని వడకట్టి నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి.ఈ విధంగా కనుక రోజుకి నాలుగు సార్లు చేస్తే తొందరగా పంటి నొప్పి సమస్య అనేది తగ్గి దాని నుండి ఖచ్చితంగా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే మరొక పద్దతి ఏమిటంటే తాజా జామ ఆకును తీసుకొని దానిని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకొని బాగా నమలాలి. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ రసం చేరేట్లు మీరు చూసుకోవాలి. నొప్పికి ప్రభావితమైన దంతాలపై ఈ రసం చాలా బాగా పనిచేస్తుంది.ఇక దంతాలలో ఉన్న బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే వైరస్ కారక క్రిములను కూడా నశింపజేస్తుంది. దంతాల నొప్పిని కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఈ ఆకుల్లో ఉన్న ఫ్లెవనాయిడ్స్ (యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ) ఇంకా అలాగే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పంటినొప్పిని చాలా ఈజీగా నివారించడంలో ఎంతో ఫర్ఫెక్ట్ గా పనిచేస్తాయి.