అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే వంటింటి పదార్థాలు ఇవే..!!

Divya
వంటింట్లో దొరికే ఎన్నో పదార్థాలతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ వంటశాలలో దొరికే దినుసులతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఆయుర్వేదం పురాతన శాస్త్రం ప్రకారం ఆరోగ్యమైన జీవనాన్ని శరీరాన్ని నిర్వహించాలి అంటే ఎన్నో ఔషధాలు తప్పనిసరి అవుతాయి.. అందుకే ఆయుర్వేదంలో ఆహారం చాలా ముఖ్యం గా వర్ణించబడింది.. జీవితం ఆహారం మానవ శరీరం లోని భాగాల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తి ఎలా ప్రభావితం అవుతాడో మనకు ఆయుర్వేదం చెబుతోంది.. అనారోగ్య సమస్యలు నయం చేయవచ్చని ఆయుర్వేదం చెబుతోంది కాబట్టి వంటింటి దినుసులతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
అల్లం:
అల్లం మనం చేసుకునే వంటల్లో ఉపయోగించడం వల్ల కడుపులో టాక్సిన్స్ ను తొలగించి, కడుపులో జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని పెంచడానికి అల్లం సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది . అంతేకాదు అల్లం తో తయారు చేసుకునే టీ తాగడం వల్ల జలుబు,  సైనస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వల్ల గెలుపుకు కారణమైన వైరస్ తో పోరాడి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల ఇలాంటి సమస్యలు దూరమవుతాయి.
జీలకర్ర:
జీలకర్రలో వుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల గ్యాస్ బయటకు పంపి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకలిని పెంచి,  కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది.

కలబంద:
కలబంద జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి కడుపు నొప్పి , తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు కలబంద చర్మసౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.
పసుపు :
భారతీయ వంటకాలలో పసుపు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. రోగనిరోధక శక్తి ని పెంచడమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కీళ్ళనొప్పులు కూడా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: