ఏఎన్ఐహెచ్: పీరియడ్స్ పై కరోనా వ్యాక్సిన్ ప్రభావం.. సర్వే ఏం..!

MOHAN BABU
 ఇప్పటివరకు జరిగిన కాలగమనంలో ఎన్నడూ లేని విధంగా కరోణ విపత్తు ప్రపంచాన్నంతా వణికిస్తోంది. అది ఎంత వేగంగా విస్తరిస్తోందో  అంతే వేగంగా వ్యాక్సిన్ రూపొందించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే ఎవరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో స్పష్టత  రావాల్సి ఉంది. తాజాగా అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారు నిర్వహించినటువంటి సర్వే సరికొత్త ఫలితాలను అందించింది. మరి సర్వే దేని మీద చేశారు ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయి తెలుసుకుందామా..!


 సాధారణంగా మహిళల ఆరోగ్యం అనేది వారి యొక్క ఋతుక్రమం పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఋతుక్రమంలో ఏదైనా మార్పులు జరిగితే వారి ఆరోగ్యం కూడా నెమ్మదిగా దెబ్బతిన్నట్టే. అయితే ఈ నేపథ్యంలో మహిళల యొక్క ఋతు క్రమంపై కరోనా వ్యాక్సిన్ ఏదైనా ప్రభావం చూపిందా అన్న దానిపై సర్వే నిర్వహించారు. అయితే ఈ యొక్క సంస్థ పరిశోధనకు సంబంధించి దాదాపు నాలుగు వేల మంది అమెరికన్ స్త్రీలను పరిశీలించారు. వారి యొక్క రుతు క్రమాల వివరాలను సేకరించి పరిశీలించారు. వీరిలో సగం మంది  ఒక డోస్ వేసుకున్న తర్వాత పిరియడ్స్ సాధారణం కన్నా ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు.

కరోనా టీకా తర్వాత ఋతుచక్రంలోని రక్త స్రావాలలో ఎలాంటి మార్పు జరగలేదని సర్వే తెలిపింది. ఈ యొక్క పరిశోధనకు బాస్ గా ఉన్న ఓరేగావ్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ చెందిన డాక్టర్ అలిసన్ దీనిపై స్పందిస్తూ అయితే కరోణ వ్యాక్సిన్ తర్వాత మహిళలు చాలా భయపడుతున్నారని, ఈ సర్వే వారికి ఊరట నిచ్చే విషయమని అన్నారు. అలాగే ఏడెన్ మన్ మాట్లాడుతూ అయితే ఈ సర్వేలో సాధారణంగా సైకిల్ పొడవు సగటున 24 నుంచి 38 రోజుల మధ్య ఉంటుందని, అన్నారు. అయితే ఈ సర్వే వ్యాక్సిన్ వేసుకున్న మహిళల్లో , మరియు వేసుకొని మహిళలకు మధ్య పోల్చి సమాచారాన్ని తీసుకున్నామని అన్నారు. అయితే ఇందులో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొద్దిపాటి చిన్న మార్పు వచ్చింది కానీ తర్వాత సాధారణంగా అయిందని ఇందులో 350 మంది మహిళల్లో నెక్స్ట్ సైకిల్ ఒకటి రెండు రోజుల తేడా తప్ప పెద్ద మార్పు జరగలేదని, తర్వాత అంతా సాధారణంగా అయిపోయిందని అన్నారు. ఈ విషయాన్నంతా ప్రసూతి గైనకాలజీ జర్నల్లో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: