"బి పి" ఉన్న వారు చలికాలం తీసుకోవలసిన జాగ్రత్తలు...

VAMSI
వాతావరణం మన శరీరంపై కూడా ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. ఎండాకాలంలో ఒక రకమైన వాతావరణం, చలికాలంలో ఒక రకమైన వాతావరణం..అలాగే వర్షాకాలం ఇలా పలు రకాల వాతావరణాలు మన శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం చలికాలం జరుగుతున్నందున ఈ సమయంలో బి పి ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. పూర్తి వివరాల్లోకి ఒకసారి వెళితే అసలు విషయం అర్దం అవుతుంది. బిపి ఉన్న వారికి ఈ కాలంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుందట.
చల్లటి వాతావరణం వలన శరీరంలో రక్త పంపిణీ జరగడానికి అధిక శక్తి కావాల్సి వస్తుందట, దీని కారణంగానే బిపి ఆటోమేటిక్ గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బిపి మరీ ఎక్కువగా పెరిగితే వచ్చే ఆరోగ్య సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ముందు జాగ్రత్తలు తప్పనిసరి.
అయితే ఇలాంటి సమయంలో ఈ చలి కాలంలో మనల్ని మనం రక్షించుకునేందుకు , అనారోగ్య సమస్యల పాలు కాకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మన దుస్తుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. చలిని ఆపగల మందపాటి దుస్తులను ధరించడం వలన శరీరం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి యధావిధిగా ఏ ఇబ్బందీ లేకుండా తన పని తాను చేసుకుంటుంది. అయితే లేయర్లు లాగా ఒక వస్త్రంపై మరొకటి వేసుకోవడం వలన వెచ్చగా ఉండటంతో పాటుగా ఊపిరి తీసుకోవడంలో తేలికగా ఉండి గుండె పనితీరు చక్కగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.  చలికాలంలో ఆల్కహాల్ తీసుకోవడం మరియు కెఫిన్ కలిగి ఉన్న పానీయాలను తాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి మన శరీర ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తాయట అందుకే వీటిని దూరం పెట్టాలి.
బిపి ఉన్న వారికి వ్యాయామం చేసే అలవాటు ఉన్నట్లైతే తస్మా జాగ్రత్త...వ్యాయామం మంచిదే కానీ మరీ అధికంగా శరీరాన్ని బాగా కష్టపెట్టేలా గుండెపై ఒత్తిడి పెరిగేలా చేయకండి ఇది చాలా ప్రమాదం.  
బిపి ఉన్న వారు....ఈ చలికాలం లో దొరికే సీజనల్ కూరగాయలను, పండ్లను తినడం ఉత్తమం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: