గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

praveen
నేటి రోజుల్లో డయాలసిస్ అనేది పేద ప్రజలకు ఎంతో భారంగానే మారిపోయింది. ఇక క్రమం తప్పకుండా డయాలసిస్ చేపించుకోవాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. దీనికోసం నేటి రోజుల్లో భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యం కోసం భారీగానే వసూల్లు చేస్తున్నాయి అని చెప్పాలి. దీంతో డయాలసిస్ చికిత్స అనేది పేదలకు రోజురోజుకు భారంగానే  మారిపోతుంది. కానీ ఏం చేస్తాం ఎంత భారం అయినప్పటికీ ప్రాణాలను దక్కించుకోవడానికి మాత్రం తప్పదు అన్నట్లుగానే పేద ప్రజలు డయాలసిస్ చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తు ఉండడం గమనార్హం.

 అయితే ఇలా డయాలసిస్ చికిత్స కోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల కోసం ఇటీవలే భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ పౌండేషన్ ట్రస్ట్ ఒక గొప్ప ఆలోచన చేసింది. పేద ప్రజలందరికీ అండగా నిలబడేందుకు సిద్ధమైంది. ఎంతో మందికి తక్కువ ఖర్చుతోనే డయాలసిస్ చికిత్స అందించి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడానికి సిద్ధమైంది భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్.  డయాలసిస్ చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టలేక బలవంతంగా భారాన్ని మోస్తున్న పేద ప్రజలందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.

 వేల రూపాయలు ఖర్చు అయ్యే డయాలసిస్ చికిత్సను కేవలం 300 రూపాయలకి అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది ఈ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఇటీవలే కింగ్ కోటి ఆస్పత్రిలోనే సెంటర్లో ప్రస్తుత సభ్యులతో కలిసి ఆ ట్రస్టు చైర్మన్ పీసీ సిరాక్ మీడియాతో మాట్లాడారు. కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 24 డయాలసిస్ యంత్రాలతో కొత్త కేంద్రాన్ని ప్రారంభించాము అంటూ ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలు డయాలసిస్ లు పూర్తి చేసిన సందర్భంగా ఈనెల 13వ తేదీన సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తమ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పేద ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: