96కోట్లు దాటిన వాక్సినేషన్.. 15వేలకు రోజువారీ కేసులు.. !

Chandrasekhar Reddy
భారతదేశంలో వాక్సిన్ కార్యక్రమం చురుక్కా సాగుతుంది. ఒకపక్క ఉపఎన్నికలు జరుగుతున్నప్పటికీ మరో పక్క వాక్సిన్ పూర్తిస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజుకు కోట్ల స్థాయిలో వాక్సిన్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే దేశంలో 96కోట్ల డోసుల వాక్సిన్ పంపిణి చేయబడింది. అలాగే దేశంలో రోజువారీ కేసులు కూడా 15వేల స్థాయికి పడిపోయాయి. అయితే ఇంకా మూడో వేవ్ యాక్టీవ్ గానే ఉన్నందున ముందస్తు జాగర్తలు తీసుకుంటూనే మరో మూడు నెలలు కరోనా తో జీవించాల్సి ఉంటుందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో కేరళ లో తప్ప మీరెక్కడ చెప్పుకోదగ్గ కేసులు నమోదు కాకపోవడంపై ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ జాగర్తలు  ఇంకొన్నాలు పాటించడం మెలనేది గుర్తుచేస్తుంది. ఏది ఏమైనా పూర్తిగా కరోనా దేశాన్ని, ప్రపంచాన్ని వీడేంతవరకు ఈ జాగర్తలు పాటించక తప్పదని వారు చెపుతున్నారు. ఇప్పటికి కూడా కొన్ని దేశాలలో కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయని ప్రజలు గుర్తుంచుకోవాలని వారు తెలిపారు.
భారత్ లో గత నెలాఖరులో కూడా 20వేలకు పైగా కేసులు నమోదు అయినప్పటికీ, తాజా పరిస్థితిలో కాస్త మార్పులు వచ్చాయి. 15వేలకు రోజువారీ కేసులు నమోదు పడిపోయింది. ఈ కేసులతో కలుపుకొని మొత్తం దేశంలో నమోదు అయిన కేసులు 34001743 కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టీవ్ గా ఉన్న కేసులు 207653 గా పేర్కొంది ఆరోగ్య శాఖ. ఇప్పటికి కరోనా పాసిటివిటీ రేటు 98.16 గా నమోదు అయ్యింది. 226మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 451189 గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుండి బయటపడిన వారి సంఖ్య 33342901 గా ఉంది. గత 24 గంటలలో ప్రభుత్వం 5063845 వాక్సిన్ లను వేసినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. దీనితో ఇప్పటివరకు కరోనా వాక్సినేషన్ అయిన వారు 964379212 మంది.
భారత్ లో ఇప్పుడే కరోనా నుండి పూర్తిగా అన్ని సంస్థలు బయటపడి, తమ కార్యకలాపాలు వారివారి కార్యాలయాల నుండే జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. మరో రెండు నెలలలో పూర్తీ స్థాయిలో అంతా యాధస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా కొన్నాళ్ళు మాత్రం జాగర్తలు పాటించక తప్పదని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: