ఈ లక్షణాలు ఉంటే అస్సలు అశ్రద్ద చేయద్దు?

Veldandi Saikiran
మన నిత్య జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ప్రస్తుత జీవిత కాలంలో ఎవరూ కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జుట్టు ఊడిపోవడం : చాలా సార్లు మన జుట్టు ఊడిపోవడం చూస్తుంటాం. అయితే జుట్టు ఊడి పోయింది అంటే మన శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్లుగా మనం కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఒక రోజుకు వంద వెంట్రుకల వరకూ ఊడటం సహజం.. అయితే దీని కంటే ఎక్కువ ఊడితే అది చాలా ప్రమాదకరం. అలాగే బాగా నీరసంగా ఉండటం మరియు చాలా అలసిపోవటం కూడా ఐరన్ లోపమే. ఇలాంటి లక్షణాలు మనం గుర్తించగలిగే... ఐరన్ లోపం ఉంది మనం అధిగమించాలి.
బాగా బరువు తగ్గిపోవటం : మనం ఒక్కసారిగా బరువు తగ్గిపోవటం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. ఒక్కసారిగా మరియు తగ్గిపోవడాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఈ బరువు తగ్గిపోవడానికి అసలైన కారణం పోషకాహార లోపం. మన బాడీ మైక్రో న్యూట్రియంట్స్ మరియు మాక్రో న్యూట్రియన్స్  పైన మన ఆధార్ పడి ఉంటుందని తెలుసుకోవాలి. మన శరీరంలో వీటి హెచ్చుతగ్గులు ను గ్రహించుకోవాలి.
రేచీకటి : అయితే రాత్రి సమయంలో చూపు సరిగా కనిపించక పోయినా అది పోషకాహార లోపమే అవుతుంది. దీనికి ముఖ్య కారణం విటమిన్ డి ఏ లోపము. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే... విటమిన్  ఏ మన శరీరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తే ఇంకా మంచిది.
ఎముకల నొప్పి : మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి మరియు కాల్షియం ఎంతో అవసరం. అయితే మన శరీరంలో ఎలాంటి ఎముకల నొప్పి వచ్చినచో... అది విటమిన్ డి లోపం అని గ్రహించాలి. ఈ నేపథ్యంలో సరైన వైద్యులను సంప్రదిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.
గాయాలు త్వరగా మానకపోవడం : మనకు అప్పుడప్పుడు గాయాలు అయినప్పుడు అవి తొందరగా తగ్గవు. దీనికి ముఖ్యమైన కారణం పోషకాహార లోపమే. దీనిని మనము అధిగమిస్తే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.
ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ : మన శరీరంలో హార్ట్ బీట్ ది ముఖ్యమైన పాత్ర. ఒక్కొక్కసారి హార్ట్ బీట్ ఆగిపోతే మన పని అంతే. అయితే ఇలాంటి నేపథ్యంలో హార్ట్ బీట్ రెగ్యులర్ జరగకపోతే... వైద్యులను సంప్రదించాలి. అలాగే సరైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: